దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్ మెయిల్స్ పంపిస్తోంది. ఏటీఎం రిలేటెడ్ స్కిమ్మింగ్ ఫ్రాడ్స్ నడుస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. గత కొద్ది నెలల నుంచి ఈ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయని కస్టమర్లకు పంపిన మెయిల్‌లో తెలిపింది. దీంతో పాటు మరికొన్ని అలర్ట్స్ ను కూడా జారీ చేసింది. గతేడాది SBIఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ 20 వేలకు కుదించిన సంగతి అందరికీ విదితమే. ఈ శీర్షికలో భాగంగా ఏటీఎం కార్డు స్కిమ్మింగ్ ,ఎలా రిపోర్ట్ చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం.
ఏటీఎం కార్డు ద్వారా 40 వేల నుంచి 20 వేలకు విత్ డ్రా లిమిట్ ను కుదించింది. అయితే ఇది కొంతమందికి వరంలా మారింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి మాగ్నస్ట్రిప్ కార్డుల స్థానంలో చిప్ బేస్‌డ్ కార్డులను ప్రవేశపెట్టింది.
ఈ రోజుల్లో ప్రధానంగా కార్డు స్కిమ్మింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఏటీఎంలు కాని పీఓఎస్ మిషిన్ల ద్వారా కాని ఇది జరుగుతోంది. యూజర్ల ఏటీఎం కార్డుల నుండి తేలికగా బ్యాంకు వివరాలను తస్కరిస్తున్నారు.ఏటిఎం మిషన్ల దగ్గర అలాగే పీఓఎస్ ల దగ్గర చిన్న చిన్న రహస్య పరికరాలను అమర్చి దొంగతనానికి పాల్పడుతున్నారు.
మాగ్నటిప్ కార్డు ద్వారా సమాచారం మొత్తాన్ని సేకరించి ఎవరికీ తెలియకుండాఆ సమాచారాన్ని స్టోర్ చేసుకుంటున్నారు. ఏటీఎం సెంటర్లో కాని అలాగే షాపుల్లో కాన్ని ఎవరికీ తెలియకుండా రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి వివరాలను తస్కరిస్తున్నారు. కస్టమర్ల వివరాలను సీక్రెట్ కెమెరాల ద్వారా తేలికగా హ్యాక్ చేస్తున్నారు.
మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వింనే మీరు మీ మొబైల్ నుంచి Problem అని టైపు చేసి 9212500888కు ఎసెమ్మెస్ చేయండి. ఇంకో విధంగా రిపోర్ట్ చేయాలనుకుంటే మీ ట్విట్టర్ నుండి @SBICard_Connectకి కంప్లయిట్ చేయవచ్చు.