• తాజా వార్తలు

రూ. 10,000లోపు ధ‌ర‌లో ఉన్న బెస్ట్ ఫోన్స్ ఇవి

ఎక్కువ ఫీచ‌ర్లు.. త‌క్కువ బ‌డ్జెట్.. ఇదీ మొబైల్ కొనాల‌నుకునే వారి ప్రాధాన్యం. అందుకు త‌గ్గ‌ట్టుగానే బ‌డ్జెట్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ల‌పై ప్ర‌ధాన మొబైల్ కంపెనీలు దృష్టిపెట్టాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా బ‌డ్జెట్ లోపే  బెస్ట్ ఫోన్ల‌ను త‌యారుచేస్తున్నాయి. 5.5-6 అంగుళాల స్క్రీన్‌, మంచి సెల్ఫీ కెమెరా, ఎక్కువ బ్యాట‌రీ లైఫ్‌, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్‌తో పాటు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఎక్కువ ఇంట‌ర్న‌ల్ జీబీ.. వంటి ఫీచ‌ర్ల‌న్నీ ప్ర‌స్తుతం రూ.10వేల లోపు ఉన్న స్మార్ట్ మొబైల్‌లోనే వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన బెస్ట్‌ బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం..

రియ‌ల్‌మీ 1 (Realme 1)
షియామీకి పోటీగా మొబైల్ కంపెనీ ఒప్పో రియ‌ల్‌మీ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైనే గాక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్స్ కూడా రియ‌ల్‌మీ1 సొంతం. మీడియాటెక్ హీలియో పీ60 చిప్ సెట్‌ ఆధారంగా ప‌నిచేస్తుంది. ఫోన్ వెనుకభాగం రిఫ్లెక్ట్ అయ్యేలా ఫైబర్ గ్లాస్ బాడీతో డైమండ్ బ్లాక్ ఫినిషింగ్‌తో తీర్చిదిద్దారు. ఈ ఫోన్ 3జీబీ, 4 జీబీ, 6 జీబీ ర్యామ్ మోడ‌ల్స్‌లో ల‌భిస్తోంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ గ‌ల మోడ‌ల్ రూ.8,990, 4జీబీ, 64 జీబీ మోడ‌ల్ రూ.10,999కి ల‌భిస్తోంది.  

షియామీ రెడ్‌మీ నోట్ 5 (Xiaomi Redmi note 5)
త‌క్కువ‌ బ‌డ్జెట్ మొబైల్స్‌లో షియామీ త‌న ప‌ట్టు నిలుపుకుంటోంది. బెస్ట్ ఫీచ‌ర్లు ఇస్తూనే బిల్డ్ క్వాలిటీ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌కుండా వివిధ ర‌కాల మోడ‌ల్స్‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉంది. చూడ‌గానే ముచ్చ‌ట‌గొలిపే డిజైన్‌తో మెరుగైన బ్యాట‌రీ లైఫ్ క‌లిగి ఆక‌ర్ష‌ణీయంగా ఫొటోలు తీయ‌గ‌ల‌ కెమెరాలు.. ఈ రిక్వైర్‌మెంట్స్‌తో షియామీ నుంచి వ‌చ్చిన స్మార్ట్ ఫోన్‌.. రెడ్‌మీ నోట్‌5. 5.99 అంగుళాల డిస్ల్పే క‌లిగిన ఈ ఫోన్‌.. శ‌క్తిమంత‌మైన స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌తో ప‌నిచేస్తుంది.  అంతేగాక రెడ్‌మీ ఫోన్ల‌లోలానే భారీ బ్యాట‌రీ ఉంది. 4,000ఎంఏహెచ్‌తో ఉంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ 3 జీబీ, 4 జీబీ ర్యామ్ మోడ‌ళ‌ల్లో లభిస్తోంది. 
3 జీబీ, 32 జీబీ మోడ‌ల్ ధర రూ.9,999 ఉండ‌గా, 4 జీబీ, 64 మోడ‌ల్ రూ.11,999కి ల‌భిస్తోంది. 

లెనోవో కే8 ప్ల‌స్‌ (lenovo k8 plus)
ప్ర‌స్తుతం షియామీ రెడ్‌మీ, ఒప్పో వంటి మొబైల్ సంస్థ‌లు దూసుకుపోతున్న స‌మ‌యంలో.. లెనోవో కూడా ఉనికి చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల‌ను త‌యారుచేస్తోంది. ఇందులో లెనోవో కే8, లెనోవో కే8 నోట్ త‌క్కువ బ‌డ్జెట్‌లో అందిస్తోంది. మీడియాటెక్ హీలియో పీ25 ప్రాసెసర్ మీద ప‌నిచేసే ఈ మొబైల్స్ 3జీబీ, 32 జీబీ విభాగంలోనే ల‌భిస్తున్నాయి. దీని ధ‌ర రూ.9,999! 

మోటో జీ5ఎస్‌ (moto G5s)
బెస్ట్ బ‌డ్జెట్ రేంజ్ మొబైల్స్‌లో మోటో ముందువ‌రుస‌లో ఉంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో పాటు శ‌క్తిమంత‌మైన స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌పై ప‌నిచేసే మోటో జీ5ఎస్‌ మొబైల్‌ను వినియోగ‌దారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతం ఇది ఆండ్రాయిడ్ 7.1 మీద ప‌నిచేస్తున్నా.. త్వ‌ర‌లో ఓరియోకి అప్‌డేట్ రానుంది. బిల్డ్ క్వాలిటీ విష‌యంలో ఏమాత్రం రాజీ లేకుండా బ్యాట‌రీ బ్యాకప్ అధికంగా ఉండే ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్‌తో వ‌స్తోంది. దీనిని గ‌త ఏడాది ఆగ‌స్టులో  విడుద‌లైన ఈ ఫోన్ ధ‌ర అప్పుడు 13,999 ఉండ‌గా.. ఇప్పుడు రూ.10వేల లోపే ఉంది. 

షియామీ రెడ్‌మీ 5 (Xiaomi Redmi 5)
మెరుగైన బిల్డ్ క్వాలిటీ, అంత‌కు మించి బ్యాట‌రీ బ్యాక‌ప్, శ‌క్తిమంత‌మైన ప్రాసెస‌ర్ ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపితే షియామీ ఫోన్‌! త‌క్కువ ధ‌ర‌లోనే ఎక్కువ ఫీచర్లు అందిస్తున్న ఈ కంపెనీ నుంచి విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. వీటిలో రెడ్‌మీ 5 ముందు వ‌రుస‌లో ఉంది. ఇది 2జీబీ, 3జీబీ, 4 జీబీ మోడ‌ళ్ల‌లో ల‌భిస్తోంది. 2జీబీ, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌గ‌ల ఫోన్ కేవ‌లం రూ.7,999. 3జీబీ, 32జీబీ ధ‌ర రూ.8,999, 4 జీబీ, 64 జీబీ ధ‌ర రూ.10,999! అయితే కెమెరాల విష‌యంలో మాత్రం కొంత నిరుత్సాహ ప‌డ‌క త‌ప్ప‌దు. అంతేగాక ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్ష‌న్ లేక‌పోవ‌డం కూడా చిన్న మైన‌స్‌. 

ఇన్‌ఫినిక్స్ హాట్ ఎస్‌3 (Infinix hot S3)
సుమారు 6 అంగుళాల డిస్ల్పే క‌లిగి స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌తో పాటు ఆండ్రాయిడ్ ఓరియోతో 10వేల లోపు ల‌భిస్తున్న స్మార్ట్ ఫోన్‌.. ఇన్‌ఫినిక్స్ హాట్ ఎస్‌3. ప్ర‌స్తుతం ఇది రెండు మోడ‌ళ్ల‌లో మార్కెట్లో అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మోడ‌ల్ రూ.8,999, 4 జీబీ, 64 జీబీ మోడ‌ల్ రూ.10,999. వీటితో పాటు ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్‌తో పాటు ఆండ్రాయిడ్ ఓరియో వంటి ఫీచ‌ర్ల‌తో హాన‌ర్ 9 లైట్ మొబైల్ రూ.10,999కు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్రాన్ టి.ఫోన్ పి కూడా త‌క్కువ బ‌డ్జెట్‌తో ఎక్కువ ఫీచ‌ర్ల‌తో వ‌స్తోంది. అంతేగాక ఇందులో 5వేలఎంఏహెచ్ బ్యాట‌రీ కూడా ల‌భిస్తోంది.