ఇండియన్ మార్కెట్లో మళ్లీ నిలదొక్కుకోవాలని నోకియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే లేటెస్ట్‌గా నాలుగు కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది ఇందులో రెండు ఫీచర్ ఫోన్లు., రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నోకియా 5.3, నోకియా సీ3 పేరుతో విడుదలైన ఈ ఫోన్ల విశేషాలు చూద్దాం
నోకియా 5.3 ఫీచర్లు
* 6.55 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్
* 4జీబీ/ 6జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ
కెమెరాలు
వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. 13 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు 5, 2, 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. సెల్ఫీల కోసం ముందువైపు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
ధర
సెప్టెంబర్ 1 నుండి కొనుగోలు చేయవచ్చు. 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999. 6 జీబీ ర్యామ్ మోడల్ రూ .15,499.
రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 2వేల రూపాయల క్యాష్‌బ్యాక్ , మరో 2వేల రూపాయల వోచర్లు ఇస్తుంది.
నోకియా సీ 3 ఫీచర్లు
* 5.99 ఇంచెస్ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 2 జీబీ/3 జీబీ ర్యామ్
* 16 జీబీ/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ . 128 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
* 3040 ఎంఏహెచ్ బ్యాటరీ
* 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
ధర
సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.
ధర 2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర రూ.7,499. 3 జీబీ / 32 జీబీ వేరియంట్ 8,999 రూపాయలు. సంవత్సరం రీప్లేస్ మెంట్ గ్యారంటీ వస్తున్న ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 17 నుంచి నోకియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ లో కొనుక్కోవచ్చు.