డ్యూయల్ సిమ్ ఫోన్లలో ఒక సిమ్ మాత్రమే 4జీ వోల్ట్ ఫీచర్‌ను సపోర్ట్ చేయడం మనకు ఇప్పటివరకు తెలుసు. ఇప్పుడు రెండు సిమ్‌లూ ఈ ఫీచర్‌తో వచ్చేలా చాలా ఫోన్లు రిలీజయ్యాయి. ఇలా రెండు సిమ్‌లూ 4జీ వోల్ట్‌తో పనిచేసే ఫోన్ల గురించిన సమగ్ర సమాచారం మీకోసం..
ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 (Asus Zenfone Max Pro M1)
తైవాన్ కంపెనీ ఆసుస్ గత నెలలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో రెండు సిమ్‌లూ 4జీ వోల్ట్ కనెక్టివిటీతో పనిచేస్తాయి. 5.99 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ఎస్‌వోసీ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో స్టాక్ ఆండ్రాయిడ్‌తో వచ్చిన ఈ ఫోన్ మూడు ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. 3జీబీ ర్యామ్/ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999. 4జీబీ/ 64జీబీ మోడల్ ధర 12,999.. ఇక 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రిలీజయిన మోడల్ 14,999 రూపాయలకు దొరుకుతుంది.
ఒప్పో రీఆల్మే1 (Oppo Realme 1)
ఒప్పో తన సబ్‌బ్రాండ్ రీఆల్మ్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇది. డ్యూయల్ 4జీ వోల్ట్ సపోర్ట్ ఫీచర్‌తో వచ్చిన ఫోన్లలో ఇదే చౌకది. 6ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే. మీడియాటెక్ హీలియో పీ 60 ఎస్‌వోసీ ప్రాసెసర్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లోని ఫీచర్లు. 3జీబీ ర్యామ్/ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 8,990. 6జీబీ/ 128జీబీ మోడల్ ధర 13,990. ఈ నెల 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది.
ఒప్పో ఎఫ్ 7 (Oppo F7)
మీడియాటెక్ హీలియో పీ 60 ఎస్‌వోసీ ప్రాసెసర్, డ్యూయల్ 4జీ వోల్ట్ ఫీచర్‌తో రిలీజయింది ఒప్పో ఎఫ్ 7 ప్లస్. 6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, వెనకవైపు కూడా గ్లాస్‌తో చాలా స్టయిలిష్‌గా కనిపిస్తుంది. పర్‌ఫెక్ట్ సెల్ఫీ కెమెరా సిరీస్‌లో భాగంగా ఒప్పో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో ఏఐ పవర్‌తో వచ్చిన 25 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌తో 16 ఎంపీ రియర్ కెమెరా దీని స్పెషాలిటీస్. 4జీబీ ర్యామ్/ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 21,180. 6జీబీ/ 128జీబీ మోడల్ ధర 26,990.
హానర్ వ్యూ 10 (Honor View 10)
హువావే సబ్‌బ్రాండ్ హానర్ నుంచి వచ్చిన హానర్ వ్యూ 10.. ఇండియాలోడ్యూయల్ సిమ్ డ్యూయల్ వోల్ట్ టెక్నాలజీతో వచ్చిన తొలిఫోన్. 5.9 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, కైరిన్ 970 చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని ఫీచర్లు. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది. ధర 29,990 నుంచి ప్రారంభం
హానర్ 10 (honor 10)
హువావే సబ్‌బ్రాండ్ హానర్ నుంచి వచ్చిన మరో డ్యూయల్ సిమ్ డ్యూయల్ వోల్ట్ ఫోన్..హానర్ 10. 5.84 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, హై సిలికాన్ కైరిన్ 970 చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని ఫీచర్లు. ధర 32,999నుంచి ప్రారంభం
హువావే పీ20 ప్రో (Huawei P20 Pro)
హువావే నుంచి రాబోతున్న మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ .. హువావే పీ 20ప్రో. 40 మెగాపిక్సెల్, 20 ఎంపీ, 8 ఎంపీ లెన్స్‌లతో కూడిన మూడు లైకా బ్రాండెడ్ కెమెరాలు ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఫొటోలు ఇస్తాయి. 24 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, హై సిలికాన్ కైరిన్ 970 చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ దీని ఫీచర్లు. ధర 64 వేలు.
నోకియా 7 ప్లస్ డ్యూయల్ 4జీ (nokia 7 plus dual 4g)
లేటెస్ట్ అప్‌డేట్స్‌తో నోకియా 7 ప్లస్, నోకియా 6 రెండూ కూడా డ్యూయల్ సిమ్ డ్యూయల్ సపోర్ట్‌తో పని చేస్తాయి. నోకియా 7ప్లస్ ధర 25,999. నోకియా 6.. 3జీబీ వెర్షన్ 16,999 రూపాయలు. 4జీబీ వెర్షన్ 18,999 రూపాయలు.