చైనా ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో హవా ప్రారంభించకముందు హెచ్‌టీసీకి మంచి గ్రిప్ ఉండేది. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు మంచి క్వాలిటీ, పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేవి. అయితే నెమ్మదిగా రేసులో వెనుకబడ్డ హెచ్‌టీసీ మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. 25వేలకు పైగా ప్రైస్ రేంజ్ ఉండే ఫోన్ల సెగ్మెంట్‌లో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో అనే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లేటెస్ట్‌గా లాంచ్ చేసింది.
ప్రీమియం మిడ్ రేంజ్‌లో పోటీ
ప్రీమియం మిడ్ రేంజ్ (25వేలకు పైగా ధర ఉన్న) సెగ్మెంట్.. ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో విదేశీ కంపెనీలను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న షియోమి ఎంఐ5, జెన్‌ఫోన్ 3, వన్‌ప్లస్ 3కి పోటీగా హెచ్‌టీసీ.. ఈ డిజైర్ 10 ప్రోను లాంచ్ చేసింది. దీని ధర 26,490 రూపాయలు. కెమెరా మీద బాగా దృష్టి పెట్టింది. ఫ్రంట్, రియర్ కెమెరాలకు లేటెస్ట్ సెన్సర్లు అమర్చింది.
స్పెసిఫికేషన్స్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన 5.5 ఇంచెస్ ఫుల్ హెడ్‌డీ డిస్‌ప్లే
* ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ10 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్‌డీ కార్డ్‌తో 3 పెంచుకోవచ్చు.
* లేజర్ ఆటోఫోకస్, బీఎస్ఐ సెన్సర్లతో ఉన్న 20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సర్, వైడ్ యాంగిల్ సెల్ఫీ కోసం సెల్ఫీ పనోరమా ఫీచర్
* 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.01 ఓఎస్
గట్టి పోటీ
అయితే ఈ సెగ్మెంట్‌లో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రోకు మంచి కాంపిటీషనే ఎదురవుతుంది. వన్‌ప్లస్ 3 ఇప్పటికే మార్కెట్‌లో మంచి క్రేజ్ సాధించింది. ఎంఐ5, జెన్‌ఫోన్ 3 ఇంకా ఆ స్థాయికి రానట్లే. వాటన్నింటితో కంపీట్ చేస్తూ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.