• తాజా వార్తలు

నోకియా 3310కి మ‌రో క్లోన్‌.. ధ‌ర 600 మాత్ర‌మే

 

ఒక‌ప్పుడు సెల్ ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా మ‌ళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. త‌న ఆల్‌టైం ఫేవ‌రెట్ ఫోన్ నోకియా 3310ని క‌మ్ బ్యాక్ ఎడిష‌న్‌గా మార్కెట్‌లోకి తెచ్చింది.  ఈ ఏడాది మొద‌ట్లో జ‌రిగిన మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్‌లో ఈ మోడ‌ల్‌ను రివీల్ చేసింది,. అప్ప‌టి నుంచి ఈ ఫోన్‌ను పోలి ఉండే ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. Micromax X1i  మోడ‌ల్స్ సేమ్ టు సేమ్ నోకియా 3310లాగే ఉంటుంది. ఇక Darago 3310 అయితే ఇంచ్ టు ఇంచ్ నోకియాకి కాపీనే. ఇప్పుడీ కేట‌గిరీలో మ‌రో ఫోన్ చేరింది. దాని పేరు లాఫీ 3310 ( Lafee 3310)
అన్నీ సేమ్ టు సేమ్ 
నోకియా 3310లో మాదిరిగా 1.7 ఇంచెస్ టీఎఫ్‌టీ స్క్రీన్‌, డ్యూయ‌ల్ సిమ్‌, వీజీఏ కెమెరా ఇలా అన్ని ఫీచ‌ర్లూ లాఫీ 3310లో సేమ్ టు సేమ్‌.   బ్లూ, లైట్ గ్రే, ఆరంజ్‌, ఎల్లో క‌లర్స్‌లో వ‌చ్చింది. ఈ క‌ల‌ర్స్ కూడా నోకియాకి కాపీయే.  ధ‌ర విష‌యానికి వ‌స్తే ఇది 600 రూపాయ‌ల‌కు దొరుకుతుంది.  పెర్‌ఫార్మెన్స్ విష‌యంలో నోకియాను రీచ్ కాక‌పోయినా నోకియాలా ఉంది క‌దా అనే మౌత్ టాక్‌తో బిజినెస్ చేసుకోవాల‌నే టార్గెట్‌తోనే కంపెనీ  ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన‌ట్లు కనిపిస్తోంది.