• తాజా వార్తలు

శాంసంగ్ గెలాక్సీ ఎం30 vsఎం20 -రెండింటి మధ్య ఏమిటా వ్యత్యాసాలు

భారత మార్కెట్లోకి...దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం శాంసంగ్....చైనా కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారత మార్కెట్లోకి రెండు సరికొత్త మోడల్స్ ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం సీరిస్ లో భాగంగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం20, ఎం30 పేర్లతో మంచి ఫీచర్లతో ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ రెండ్ స్మార్ట్ ఫోన్ల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం. 

డిస్ ప్లే అండ్ డిజైన్ ....
యూత్ ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్లను తయారు చేశారు. గెలాక్సీ ఎం 20 స్మార్ట్ ఫోన్ 6.3అంగుళాల ఫుల్ హెచ్ డి ఇన్ఫినిటి వీ డిస్ల్పేనతో రూపొందించారు. ఇన్ఫినిటి వీ పేరుతో మొదటిసారిగా నాచ్ డిస్ల్పేతో రూపొందించిన స్మార్ట్ ఫోన్లు ఇవే. ఇక ఎం 20 స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ లో లభ్యం కానుంది. 

స్పెసిఫికేషన్స్ అండ్ హార్డ్ వేర్....
గెలాక్సీ ఎం 20, ఎం 30 ఈ రెండు స్మార్ట్ ఫోన్ల ఇంటర్నల్ స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నాయి.  మాలి జి71ఎంపి2 , 1.8గిగా, ఆక్టాకర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్ పై ఆధారపడి పనిచేస్తాయి. రెండింటింలోనూ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీలో ఒకేలా ఉన్నా...కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఎం 20 ఫోన్లో ర్యామ్ 3జిబి/4జిబి ఉండగా 32జిబి/64జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ ఉంది. మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించి 512జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది. 
* గెలాక్సీ ఎం 30 స్మార్ట్ ఫోన్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/ 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 512 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో డిజైన్ చేశారు. ఈ రెండు డివైజుల్లోనూ బ్యాటరీ 5000ఎంఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ఉంది. 

* ఇక ఇతర హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లనూ చూసినట్లయితే డ్యుయల్ సిమ్, ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలేరోమీటర్, గైరో సెన్సార్, ప్రాక్సిమిటి సెన్సార్, జియోమాగ్రెటిక్ సెన్సర్, వర్చువల్ లైట్ సెన్సింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైస్ -సి ఉన్నాయి. 

కెమెరా...
ఈ రెండు డివైజుల కెమెరాల గురించి చూసినట్లయితే....ఈ రెండు ఫోన్లలో 13 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాల తో పాటు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి..

ధర ...
గెలాక్సీ ఎం 30..ఈ ఫోన్ ధర రెండు వేరియంట్లకు వరుసగా 4జిబి/64జిబి, 6జిబి/128జిబి 14,990, రూ. 17,990 ఉంది.