నోకియా గురించి తెలియని వారు మొబైల్ ప్రపంచం లో ఉండరు. స్మార్ట్ ఫోన్ ల హవా మొదలైన తర్వాత దాదాపు కనుమరుగయ్యే స్థితికి వచ్చింది కానీ ఫీచర్ ఫోన్ లలో రారాజు ఎవరంటే ఎప్పటికీ నోకియా నే అనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం.అయితే ఆ తర్వాత ఈ మధ్యనే నోకియా తన లేటెస్ట్ ఫీచర్ ఫోన్ ను నోకియా 3310 అనే పేరుతో మార్కెట్ లోనికి విడుదల చేసింది. 2 జి సపోర్ట్ తో ఉండే ఈ ఫీచర్ ఫోన్ కూడా బాగానే వినియోగదారుల ఆదరణ పొందిందని నోకియా ప్రకటించింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అచ్చం ఈ నోకియా 3310 ను పోలిన ఫోన్ లు రెండు మార్కెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇవి ఫీచర్ ల విషయం లోనూ , డిజైన్ విషయం లోనూ మరియు ధర విషయం లోనూ నోకియా 3310 కు కొంచెం అటుఇటు గా ఉంటాయి. అవే మైక్రో మాక్స్ x1i మరియు దరాగో 3310 . వాటి స్పెసిఫికేషన్ లను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మైక్రో మాక్స్ x1ఐ
ఫోన్ టైప్ : ఫీచర్ ఫోన్
స్క్రీన్ : 2.4 ఇంచెస్ 320 x 240 పిక్సెల్స్
ఇన్ పుట్ : ఆల్ఫా న్యుమరిక్ కీ పాడ్
రేర్ కెమెరా : 0.08 MP
ఇంటర్నల్ మెమరీ : 32MB
బరువు : 58 గ్రాములు
బ్యాటరీ :1300mAh
నెట్ వర్క్ : 2 జి ,
దరాగో 3310
ఫోన్ టైపు : ఫీచర్ ఫోన్
సిమ్ : డ్యూయల్ సిమ్
స్క్రీన్ : 1.77 ఇంచ్ 320 x 240 పిక్సెల్ రిసోల్యూషన్
ర్యాం : 1 MB
మైక్రో ఎస్ డి సపోర్ట్ : 8 GB వరకూ
రేర్ కెమెరా : 0.3 MP విత్ VGA ఫ్లాష్
ఫ్రంట్ కెమెరా :లేదు
కనెక్టివిటీ : 2 జి , ఎడ్జ్, బ్లూ టూత్
బ్యాటరీ : 1050 mAh