• తాజా వార్తలు

స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో రానున్న 5 స్మార్టు ఫోన్లు

స్మార్టు ఫోన్లలో ఇంతవరకు ఫాస్టెస్ట్ చిప్ సెట్ గా పేరున్న క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835తో ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ ఫోన్లు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో ఇండియాలో అందుబాటులోకి రానున్న మరికొన్ని ఫోన్లలో ఇదే చిప్ సెట్ ఉండనుంది. అలాంటి 5 ఫోన్ల వివరాలు మీ కోసం..
షియోమీ ఎంఐ 6
ఈ ఏడాది ఏప్రిల్ లో షియోమీ సంస్థ ఈ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఇండియాలో ఇది జులై రెండో వారం తరువాత లాంఛ్ చేయబోతున్నారు. 5.15 అంగుళాల డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో దీన్ని తీసుకొస్తున్నారు.
హెచ్ టీసీ యూ11
5.5 అంగుళాల క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే, 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్లతో దీన్ని కూడా జులైలోనే లాంచ్ చేయబోతున్నారు. గూగుల్ అసిస్టెంట్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ కాగా స్క్వీజ్ చేస్తే కెమేరా యాప్ ఓపెన్ కావడం ఇంతవరకు ఏ ఫోన్లో లేని, ఈ ఫోన్లో మాత్రమే ఉన్న అత్యద్భుత ఆప్షన్.
వన్ ప్లస్ 5
జూన్ 22న ఇండియాలో విడుదల కానున్న ఈ ఫోన్ కూడా స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్ తోనే వస్తోంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజి దీని అదనపు ఆకర్షణలు.
మోటోరాలా మోటో జడ్ 2
4జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ ను ఆగస్టులో విడుదల చేస్తారని భావిస్తున్నారు. మంచి ప్రాసెసర్, కెమేరా వంటి అదరగొట్టే ఫీచర్లున్నా బ్యాటరీ విషయంలో మాత్రం ఇది అన్ని మోటోరాలా ఫోన్లలా వీకే.
నూబియా జడ్ 17
కంప్యూటెక్స్ 2017 ఈవెంట్లోనే దీన్ని లాంచ్ చేశారు. ఇది కూడా 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో ఆకట్టుకుంటోంది. ఇండియాలో జులైలో విడుదల కానున్న ఇది వన్ ప్లస్ 5 కు సమానమైన ఫీచర్లను కలిగి ఉంది.