• తాజా వార్తలు

రూ. 20 వేలల్లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ పై స్మార్ట్‌ఫోన్లు మీకోసం

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటికప్పుడు అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఇంతకు ముందు 5 ఇంచ్ స్క్రీన్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని దాటి ఏకంగా 6 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఈ బిగ్గర్ స్క్రీన్ ద్వారా యూజర్లు సినిమాటిక్ వ్యూని సొంతం చేసుకుంటున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లు అన్నీ గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పై మీద వచ్చాయి. ఈ హ్యాండ్ సెట్లు కేవలం రూ. 20 వేల లోపే ఉండటం మరోక ఆసక్తికర అంశంగా చెప్పుకోవచ్చు.ఈ ఫోన్లలో గేమ్స్ అభిమానులు పబ్జి అలాగే జీటీఎ లాంటివి ఆడుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో రూ.20 వేలల్లో పై ఫీచర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల లిస్టును ఓ సారి చూద్దాం.

Samsung Galaxy A50
ధర రూ. 19,990
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్పినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 25, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.

Realme 3
ధర రూ.8,999
రియ‌ల్ మి 3 ఫీచ‌ర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy A30
ధర రూ.16,990
శాంసంగ్ గెలాక్సీ ఎ30 ఫీచ‌ర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Honor 10 Lite
బెస్ట్ ధర రూ.17,999
హాన‌ర్ 10 లైట్ ఫీచ‌ర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy A10
బెస్ట్ ధర రూ 8,490
శాంసంగ్ గెలాక్సీ ఎ10 ఫీచ‌ర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Moto G7 Power
బెస్ట్ ధర రూ.13,790
మోటో జి7 ప‌వ‌ర్ ఫీచ‌ర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1570×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, వాట‌ర్ రీపెల్లెంట్ పి2ఐ కోటింగ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.

Motorola Moto G7
బెస్ట్ ధర రూ.16,999
మోటో జి7 ఫీచ‌ర్లు
6.24 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.