స్మార్ట్‌ఫోన్‌లో హైఎండ్ మార్కెట్‌ను యాపిల్, శాంసంగ్ ఆక్రమించేశాయి. వన్‌ప్లస్‌లాంటివి వచ్చినా వాటి ముందు నిలబడడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ట్యూరింగ్ రోబోటిక్ ఇండస్ట్రీస్ అనే సంస్థ 1,600 డాలర్లు (దాదాపు లక్షా 2వేల రూపాయల) ధరతో ఓ హైఎండ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని పేరు అపాసినాటో. ఇంత ధర పెట్టి ఈ కొత్త కంపెనీ ఫోన్ ఎవరు కొంటారు? అసలు అంత ప్రైస్ పెట్టడానికి అందులో ఏం గొప్ప ఫీచర్లున్నాయి.. ఇలా అనేక డౌట్లు వస్తున్నాయా .. అయితే ఇది చదవాల్సిందే.
ఇదీ స్పెషల్
అపాసినాటో ఫోన్‌ను ఫిన్‌లాండ్‌లో గతంలో నోకియా ఫోన్లు తయారుచేసిన ఫ్యాక్టరీలోనే తయారు చేశారు. హైఎండ్ కానిసియర్జ్ సర్వీస్‌తో లింకప్ అయి ఉండే ఈ ఫోన్‌లో సర్ అలన్ (Sir Alan) అనే డిజిటల్ అసిస్టెంట్ ఉంటుంది. ఇది మీకు పీఏలా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మీ మనోభావాలకు అనుగుణంగా పని చేస్తుంది. మీకు టిక్కెట్లు బుక్ చేస్తుంది.డిన్నర్‌కో, లంచ్‌కో వెళ్లాలంటే రెస్టారెంట్‌లో సీట్ రిజర్వ్ చేస్తుంది. మీ పిల్లలు మిమ్మల్నేదైనా వస్తువు అడిగితే వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేస్తుంది. సర్ అలన్ డిజిటల్ అసిస్టెంట్ సర్వీస్‌ను రెండేళ్లపాటు పొందడానికి వెయ్యి డాలర్లు (63వేల రూపాయలు) చెల్లించాలి. ఈ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే అపాసినాటో ఫోన్‌ను ఫ్రీగా పొందవచ్చు.
ఇతర ఫీచర్లు
* లిక్విడ్ మెటల్‌తో తయారుచేశారు.
* 5.5 ఇంచెస్ ఓఎల్ఈడీ స్క్రీన్
* ఆండ్రాయిడ్ ఓఎస్ కస్టమ్ వెర్షన్
* ఫోన్ రియర్‌సైడ్‌లో పక్షి ఈకలా డిజైన్ ఉంటుంది. ఇది లైటింగ్ కండిషన్‌ను బట్టి కలర్ మారుస్తుంది.