రాకెట్ స్పీడ్ తో డెవలప్ అవుతున్న ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో బలమైన పునాది వేసుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియాలో ఐ ఫోన్ తయారు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఐ ఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్‌ను బెంగళూరులో తయారు చేస్తున్నట్లు చెప్పింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఐ ఫోన్ ఎస్ఈ ప్రపంచంలోనే టాప్ మోడల్. ఇండియాలో ఐ ఫోన్ తయారీకి దీనితోనే శ్రీకారం చుట్టబోతున్నాం. లిమిటెడ్ నెంబర్లో ఐ ఫోన్ ఎస్ఈ ఫోన్లను బెంగళూరులో తయారు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇక్కడి నుంచే ఇండియాలోని కస్టమర్లకు పంపిస్తామని ఆ ప్రకటనలో చెప్పింది. తన పార్టనర్, తైవాన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ విస్ట్రాన్ కార్పొరేషన్తో కలిసి యాపిల్.. బెంగళూరుకు సమీపంలోని తన యూనిట్‌లో ఐ ఫోన్ ఎస్ఈ మోడల్‌ను తయారు చేయబోతుంది. మొదటి నుంచి బెంగళూరు పేరే యాపిల్ ఇండియాలో ఐ ఫోన్లు తయారు చేస్తామని ప్రకటించినప్పటి నుంచి బెంగళూరు పేరే వార్తల్లో వినిపిస్తోంది. దీనికి తగ్గట్టే కర్నాటక ఐటీ మినిస్టర్ ప్రియరంజన్ ఖర్గే ఓ అనౌన్స్‌మెంట్ చేశారు. యాపిల్ సంస్థ బెంగుళూరులో ప్లాంట్ పెట్టి ఇక్కడే ఐ ఫోన్లు తయారు చేయబోతుందని, ఇక్కడి నుంచే దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుందని ఖర్గే ఫిబ్రవరిలోనే చెప్పారు. ఇండియన్ మార్కెట్ కీలకం 125 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో మొబైల్ ఫోన్లకు చాలా పెద్ద మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఇండియన్ సెల్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ షేర్ 3# మాత్రమే. దీన్ని పెంచుకోవడం కోసం యాపిల్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఐఫోన్ 7, 7+ కొన్నవారికి రిలయన్స్ జియోతో కలిసి ఏడాదిపాటు ఫ్రీ డేటా ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు ఐ ఫోన్లు ఇండియాలోనే తయారు చేస్తే వాటిపై ఇంపోర్ట్ టాక్స్‌లు తగ్గి ఫోన్ కాస్త చౌకగా వస్తుంది. కాబట్టి ఇండియన్ యూజర్లను ఆకట్టుకోవచ్చు. అదీకాక ఇక్కడే ఫోన్లు తయారుచేస్తే మేకిన్ ఇండియా ఇనీషియేటివ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంది. వీటన్నింటి నేపధ్యంలోనే యాపిల్.. తన ఐ ఫోన్ తయారీని ఇండియాలో ప్రారంభించిందని మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు ఎనలైజ్ చేస్తున్నారు.