ఆర్కోస్... పెద్దగా పరిచయం లేని స్మార్టు ఫోన్ల బ్రాండ్. ఫ్రాన్స్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ తయారీ సంస్థ ఆర్కోస్ స్మార్టు ఫోన్ల మార్కెట్లో జోరు చూపించడానికి రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ పై కన్నేసింది. ఈ ఏడాది సుమారు 8 మోడళ్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగాన తాజాగా రెండు మోడళ్లను రిలీజ్ చేసింది.
బడ్జెట్ రేంజి.. భారీ బ్యాటరీ సామర్థ్యం
ఫోన్లన్నీ బడ్జెట్ రేంజిలో ఉండడం... మంచి బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండడంతో ఇది మార్కెట్లో మంచి ఆదరణ పొందుతాయని భావిస్తున్నారు. కనీసం 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటోంది. కొన్ని మోడళ్లకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఇవన్నీ జులై నుంచి ఒక దాని తరువాత ఒకటి మార్కెట్ ఎంట్రీ ఇస్తాయి.
ఆర్కోస్ డైమండ్ గామా
'డైమండ్ గామా' పేరిట ఆర్కోస్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.14,300 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు జూలై మొదటి వారంలో లభ్యం కానుంది.
డైమండ్ గామా స్పెక్స్..
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
4జీ ఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఆర్కోస్ డైమండ్ ఆల్ఫా
'డైమండ్ ఆల్ఫా'ను శుక్రవారం విడుదల చేసింది. జులై నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. దీని ధర రూ.21,500.
స్పెసిఫికేషన్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ డ్యుయల్ రియిర్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
బ్లూటూత్ 4.2, 4జీ ఎల్‌టీఈ
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
2950 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఇంకా సఫైర్, ఆక్సిజన్, హీలియం వంటి సిరీస్ లు కూడా ఆర్కోస్ నుంచి త్వరలోనే రానున్నాయి.