ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా పనిచేసేలా పెద్ద బ్యాటరీ, మంచి ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చే స్మార్ట్ ఫోన్లు కావాలా? పెద్ద స్క్రీన్, మంచి ప్రాసెసర్, ఎక్కువ స్టోరేజీతో పాటు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే అలాంటి టాప్ 5 బెస్ట్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ల సమాచారం ఇదిగో..
షియోమీ ఎంఐ మ్యాక్స్ 2
ఫాబ్లెట్ సైజు, 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్, 5300 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ.. షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు.. కనీసం రెండు రోజులు వస్తుంది. యాప్స్ వాడుతున్నప్పుడు, గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఫోన్ స్మూత్ గా పనిచేసేందుకు ఇందులోని స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది క్వాల్‌కామ్ క్విక్ ఛార్జ్ 3.0ను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని వేగంగా చార్జ్ చేసుకునేందుకు పారలల్ చార్జింగ్ సౌకర్యం కూడా వాడుకోవచ్చు. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర: రూ. 15,999
ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1
బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో పెద్ద బ్యాటరీతో లభించేవాటిలో ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 కూడా ఒకటి. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణ. బ్యాటరీని 2A/10W చార్జర్ రెండున్నర గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్‌తో ఫోన్ మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది.
*5.9 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ క్యాప్టివ్ టచ్ స్క్రీన్
* 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
ధర: రూ. 14,999
ఇన్ ఫోకస్ టర్బో 5
అతి తక్కువ ధరకే పెద్ద బ్యాటరీతో వచ్చే స్మార్ట్ ఫోన్లలో ఇదీ ఒకటి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. ఒకసారి ఛార్జి చేస్తేచాలు మీరు రోజంతా ఎంత భారీగా యూజ్ చేసినా ఛార్జింగ్ అయిపోయే ఛాన్సేలేదు. చేస్తే బాగా వాడినా ఒకరోజుకు పైనే ఫోన్ కు చార్జ్ సమస్య రాదు. క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్ ఉంటుంది. డిస్‌ప్లే చిన్నది, అంత క్వాలిటీ కూడా లేదు. కెమెరా పనితీరు కూడా యావరేజే అయితే 6వేల లోపు ధరలో దొరకడమే దీనికున్న ప్లస్‌పాయింట్.
* ఓటీజీ కేబుల్ ద్వారా ఇతర డివైస్‌లను ఛార్జ్ చేసుకోగలిగే రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది.
* 2/3జీబీ ర్యామ్, 16/ 32 జీబీ ఇంటర్నల్ స్టెరేజ్ ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధర: రూ. 5,999
శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రో ప్రత్యేకతలు. అంటే హై క్వాలిటీ డిస్‌ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే దాదాపు రెండు రోజులు పని చేస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 652 64 బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. దీంతో గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్‌ను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడేసుకోవచ్చు. పెద్ద స్క్రీన్, మంచి ప్రాసెసర్ ఉండడంతో వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు బాగా ఉపయోగపడుతుంది. ధర కాస్త ఎక్కువే అయినా ఫీచర్లపరంగా చూస్తే ఒకే అని చెప్పొచ్చు.
* 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్ ధర: రూ. 18,990
మోటో ఈ4 ప్లస్
పెద్ద బ్యాటరీ(5000 ఎంఏహెచ్)తో అందుబాటు ధరకే దొరికే మరో ఫోన్ మోటో ఈ4 ప్లస్, 1280 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ ఉన్న 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియాటెక్ 6737 ప్రాసెసర్, 13 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్ పై పనిచేస్తుంది.
3 జీబీ ర్యామ్, 16 /32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్న ఈ ఫోన్ ధర: రూ. 8,199