• తాజా వార్తలు

రూ. 15 వేలల్లో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల సమాచారం మీకోసం

టెక్నాలజీ అమితవేంగతో పుంజుకుపోతోంది. మార్కెట్లోకి దిగ్గజ కంపెనీలు రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో ఫోన్లను తీసుకువస్తున్నాయి. అత్యంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ర్యామ్, కెమెరాల వైపు అందరి చూపు నిలుస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో 6జిబి ర్యామ్ ఫోన్లు ఇప్పుడు యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు ఈ ర్యామ్ ఫోన్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయనే చెప్పవచ్చు. గేమ్ ఎంతసేపు ఆడినా ర్యామ్ నుంచి వారికి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే వీలైనంత ఎక్కువ స్థాయిలో ర్యామ్ ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే యాప్స్ రన్ కావాలన్నా కూడా ర్యామ్ సపోర్ట్ చాలా అవసరం. ఫోన్ స్మూత్ గా రన్ కావాలంటే ర్యామ్ ఎక్కువగా ఉంటేనే రన్ అవుతుంది. అందుకే వినియోగదారులంతా రూ.15 వేల బడ్జెట్లో ఎక్కువ ర్యామ్ ఉండే ఫోన్లకోసం చూస్తున్నారు. ఈ శీర్షికలో భాగంగా రూ.15 వేలల్లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్టును ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి. 

Redmi Note 7 Pro
ధ‌ర‌
రెడ్‌మీ నోట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్‌, స్పేస్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధ‌ర‌కు, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధ‌ర‌కు లభిస్తోంది.
రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0. 

Samsung Galaxy M20
గెలాక్సీ ఎం20 3జీబీ ర్యామ్ ధ‌ర రూ.10,990 ఉండ‌గా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.12,990 ఉంది.
గెలాక్సీ ఎం20 ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Nokia 6.1 Plus
ఈ ఫోన్ ధర రూ.15,999 
నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు
5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus ZenFone Max Pro M2
అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 బ్లూ, టైటానియం కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు లభిస్తున్నది. అలాగే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు లభిస్తున్నాయి. 
అసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2 ఫీచర్లు
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Realme 2 Pro
ధర రూ.13,990
Realme 2 Pro ఫీచర్లు
6.3 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy M30
ఈ ఫోన్ గ్రేడియేష‌న్ బ్లూ, గ్రేడియేష‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా దీనికి చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.14,990గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌రను రూ.17,990 గా నిర్ణ‌యించారు. 
శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్య‌యల్ సిమ్‌, 13, 5, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Honor 8X
ధర: రూ.14,999
Honor 8X ఫీచర్లు
6.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x2340 పిక్సల్స్) టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, హైసిలికాన్ కైరిన్ 710ఎఫ్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 20 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా యూనిట్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Honor 10 Lite
ధర: రూ.14,999
Honor 10 Lite ఫీచర్లు
6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Asus Zenfone Max Pro M1
ధర: రూ.9,999
Asus ZenFone Max Pro M1 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.