స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీలో కొత్త ఫీచర్ ఫేస్ అన్‌లాక్. మీ ఫేస్ చూస్తేనే ఫోన్ అన్‌లాక్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఇది చాలా సూపర్ ఫీచర్. ఇటీవల వరకు హై ఎండ్ ఫోన్లలో మాత్రమే ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్లకు కూడా వచ్చింది. 10వేల రూపాయల లోపు ధరలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వచ్చిన స్మార్ట్‌ఫోన్ల వివరాలు మీకోసం..
షియోమి రెడ్‌మీ వై2 (Xiaomi Redmi Y2)
10వేల రూపాయల్లోపు బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలనుకుంటే షియోమి రెడ్‌మీ వై2 మంచి ఆప్షన్. 5.99 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. దీనిలో ఉన్న16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మీ కళ్లను స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకుని ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా మీ ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్ పనిచేయకపోతే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వాడుకోవచ్చు. 3జీబీ/ 4జీబీ ర్యామ్, 32 జీబీ/ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర: 9,999 నుంచి ప్రారంభమవుతుంది.
హానర్ 7ఏ, హానర్ 7సీ (Honor 7A and 7C )
హానర్ 7ఏ, హానర్ 7సీ స్మార్ట్‌ఫోన్లు రెండూ కూడా ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్‌తో రిలీజయ్యాయి. ఫుల్ వ్యూ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్ ఈ ఫోన్లలో అదనపు ప్రత్యేకతలు. హానర్ 7ఏ ధర రూ8,999. హానర్ 7సీ ధర రూ.9,999.
ఓపో రియల్‌మీ 1 (Oppo RealMe1)
లో ఎండ్ ఫోన్లతో మార్కెట్‌ను మరింత పెంచుకోవాలనుకుంటున్న ఓపో కూడా తన సబ్‌బ్రాండ్ రియల్‌మీ పేరుతో కొత్త ఫోన్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఓపో రియల్‌మీ1ను ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్‌తో లాంచ్ చేసింది. 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఫేస్‌ను గుర్తించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. బిల్ట్ క్వాలిటీ, లార్జ్ డిస్‌ప్లే, ఫింగర్‌ప్రింట్ స్కానర్ దీనికి అదనపు ఆకర్షణలు. ధర 8,990 నుంచి 13,990 వరకు ఉంటుంది.
ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3 (Infinix Hot S3)
ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి కూడాఫేషియల్ అన్‌లాక్ ఫీచర్‌తో ఓ ఫోన్ లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3లో ఉన్న 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఫేస్‌ను రికగ్నైజ్ చేసి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. 5.65 ఇంచెస్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర కూడా 10వేల లోపే.