• తాజా వార్తలు

5వేల‌కే లావా నుంచి స్మార్ట్‌ఫోన్‌

ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లోకి మ‌రో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చింది. బ‌డ్జెట్ రేంజ్ సెల్‌ఫోన్ ఉత్పత్తులు త‌యారు చేసే లావా కంపెనీ.. లావా ఏ 77 పేరుతో 4జీ వోల్ట్‌తో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను శుక్ర‌వారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,099గా కంపెనీ నిర్ణయించింది. ఈఏడాది మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్‌లో లావా జెడ్ 10, లావా జెడ్ 25 మోడ‌ల్స్‌ను రిలీజ్ చేసిన లావా తాజాగా లావా ఏ 777 పేరుతో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకొచ్చింది.
ఇవీ ఫీచర్లు
* 480x800 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో 4.5 ఇంచెస్ ట‌చ్ స్క్రీన్ * 1.3గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రొసెసర్‌ * 1జీబీ ర్యామ్‌ * 5 మెగాపిక్సల్ రియ‌ర్ కెమెరా * 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫ్లాష్‌లైట్‌ * 8జీబీ ఇంట‌ర్న‌ల్ మెమొరీ * ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌ * 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధ‌ర త‌గ్గొచ్చు
లావా ఏ777 ధర రూ.6,099గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో 5వేల రూపాయ‌ల లోపే ఈ ఫోన్ దొరికే అవ‌కాశం ఉంది. అయితే షియోమీ రెడ్‌మీ 4ఏ వంటి చైనా మొబైల్స్ లేదా కార్బ‌న్ ఓరా 4జీ ప్ల‌స్ తో గానీ పోల్చినా స్పెసిఫికేష‌న్లు త‌క్కువే. బ్లూ, గోల్డ్‌, గ్రే కలర్‌ వేరియంట్లలో ఈ స్మార్ట్‌పోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది