ఒప్పో కంపెనీ తన లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌క్ ఒప్పో ఏ 12ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. బడ్జెట్ ధరలోనే యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు ఒప్పో ప్రకటించింది.
ఒప్పో ఏ12 ఫీచర్లు
* డిస్‌ప్లే: 6.22 ఇంచెస్ర్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ స్టైల్ డిస్‌ప్లే నాచ్‌తో చూడడానికి బాగా కనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది.
* ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్
* ఓఎస్: ఆండ్రాయిడ్ 10
* ర్యామ్: 3జీబీ/ 4జీబీ
* ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ/ 64 జీబీ. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
* 4జీ ఫోన్
* బ్లూ, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
కెమెరాలు
వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం ఫ్రంట్ 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఒప్పో ఫోన్లలో కెమెరా పనితనం బాగానే ఉంటుంది కాబట్టి ఈ కెమెరాలతోనే మంచి ఫోటోలే వస్తాయని అంచనా. ఏఐ బ్యూటిఫికేషన్ మోడ్, సో లూప్ వీడియో ఎడిటర్ ఫీచర్లను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారు.
బ్యాటరీ
ఈ ఫోన్‌లో బ్యాటరీ మంచి ప్లస్‌పాయింట్. 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
ధర
మంచి ఫీచర్లున్న ఈ ఒప్పో ఏ12 ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే అందిస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.9,990. 43జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.11,490.