భారత్‌లో ఇప్పుడు బడ్జెట్ ఫోన్ల హవా నడుస్తోంది. మోటరోలా, శాంసంగ్ లాంటి దిగ్గజాలతో పాటు నోకియా కూడా త్వరలో బడ్జెట్ ఫోన్లతో రంగంలోకి దిగబోతోంది. ఐతే అదే రేంజ్‌లో మరో ఫోన్ రంగంలోకి దిగింది. అదే కూల్‌పాడ్ నోట్ 5 లైట్. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో పాటు తక్కువ ధరలో మార్కెట్లోకి వచ్చిందీ స్మార్టుఫోన్. గతంలో మార్కెట్లోకి వచ్చి కస్టమర్ల మెప్పు పొందిన కూల్‌పాడ్ సిరీస్ మొబైల్స్ ఈసారి కూడా అదే స్థాయిలో ఫోన్లను తీసుకొచ్చింది. వీటి ధర రూ.10 వేల లోపే ఉంది. గతంలో వచ్చిన కూల్ పాడ్ నోట్ 3 లైట్‌కు కొబనసాగింపుగా వచ్చిన కూల్‌పాడ్ నోట్ 5 లైట్‌ను తీసుకొచ్చింది ఈ చైనా మొబైల్ తయారీ సంస్థ. ప్రస్తుతం మార్కెట్లో దొరకుతున్న ఫోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న తక్కువ ధర పలుకుతున్న ఫోన్ ఇదే. బిల్డ్ క్వాలిటీ, డిజైన్ పరంగా ఈ ఫోన్‌ను ఖరీదైన ఫోన్లకు ఏ మాత్రం తీసిపోదు.
3జీబీ ర్యామ్‌తో..
కూల్‌పాడ్ నోట్ 5 లైట్ మొబైల్ ధర రూ.8199 మాత్రమే. ఇందులో ఉన్న ఫీచర్లకు ఈ ధర చాలా తక్కువే మరి. 3 జీజీ ర్యామ్ సామర్థ్యం ఉండడమే దీనికి ఉదాహరణ. జియోమి, లెనొవో బడ్జెట్ ఫోన్లలో లేని ఫీచర్లు కూల్‌పాడ్ నోట్ 5 లైట్‌లో ఉన్నాయి. 3జీబీ ర్యామ్‌తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ రక్షణ ఈ ఫోన్‌కు ఉన్న మరో సౌలభ్యం. స్పేస్ గ్రే కలర్‌లో మాత్రమే లభ్యమవుతున్న ఈ ఫోన్ మెటల్ యునిబాడీతో తయారైంది. ఫ్రేమ్ మరియు బటన్స్ కూడా చాలా మృదువుగా ఉంటాయి. పవర్, వాల్యూమ్ బటన్స్ సరైన స్థానాల్లో అమర్చారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ ట్రే మరో ఆకర్షణ. ఇందు రెండు నానో సిమ్‌లు లేకపోతే ఒక నానో, ఒక మైక్రో సిమ్ ఉపయోగించుకోవచ్చు.
అదిరే డిస్‌ప్లే
ఈ కూల్‌పాడ్ నోట్ లైట్ 5లో డిస్ ప్లే మాత్రం సూపర్. 2.5 డి గ్లాస్‌తో ఎడ్జ్‌లో వంపులు తిరుగుతూ అందంగా తయారు చేశారు. అడ్‌హెసివ్ ప్రొటెక్టర్ వాడితే ఈ గ్లాస్ మరింత అందంగా ఉంటుంది. సింగిల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్న కెమెరా మరో ఆకర్షణ. ఈ కెమెరా కిందే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 5 అంగుళాల డిస్‌ప్లేతో పాటు మంచి రిజల్యూషన్ ఈ ఫోన్ సొంతం. 1.4 గిగా హెట్జ్ ప్రొసెసర్‌తో ఆ ఫోన్ అందరికి నచ్చేలా ఉంది. 3 జీబీ ర్యామ్ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్‌లో కనీసం ఎప్పుడూ 1 జీబీ ఖాళీ ఉంటుంది. 16 జీబీ స్టోరేజ్‌ను కావాలంటే 64 జీబీవరకు పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ మార్ష్‌మెలో వెర్షన్‌తో దీన్ని తయారు చేశారు.