• తాజా వార్తలు

డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో ఒప్పో ఎఫ్‌3 లాంచింగ్ నేడే

సెల్ఫీ కెమెరాల స్థాయిని అమాంతం పెంచేసిని చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో మ‌రో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్తో మార్కెట్లోకి దూసుకురాబోతోంది. ఒప్పో ఎఫ్‌3 పేరుతో ఈ రోజే ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేయ‌బోతోంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ రెండు కెమెరాలు ఉండ‌డం దీనిలో అతిపెద్ద ప్ల‌స్‌పాయింట్‌.
అదే స్పెష‌ల్
ఒప్పో ఎఫ్ 3+ను కొన్ని నెల‌ల క్రితం ఇండియాలో లాంచ్ చేసిన కంపెనీ దానికి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో ఎఫ్ 3 మోడ‌ల్‌ను కూడా మార్కెట్లోకి లాంచ్ చేయ‌నుంది. ఎఫ్ 3+ మాదిరిగానే ఈ ఫోన్ కూడా సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్. సెల్ఫీల కోసం ఫ్రంట్ ఫేసింగ్ లో రెండు కెమెరాలు ఉంటాయి. ఇదే ఈ ఫోన్ యూనిక్ ఫీచ‌ర్ అని కంపెనీ చెబుతోంది. మ‌రో చైనా కంపెనీ వివో లాంచ్ చేసిన వివో 5ఎస్‌, వివో 5+ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ల‌కు పోటీగా ఎఫ్ 3ని ఒప్పో తీసుకొస్తోంది.
ఫీచ‌ర్లు
* అల్యూమినియం అల్లాయ్ బాడీ * 5.5 ఇంచెస్ ఎఫ్‌డీహెచ్ ఐపీఎస్ డిస్‌ప్లే * కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 * 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ 6750- 64 బిట్ ప్రాసెస‌ర్‌ * 4జీబీ ర్యామ్‌ * 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ * హోం బ‌ట‌న్ విత్ ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌ * 3,200 ఎంఏహెచ్ బ్యాట‌రీ * ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
రెండు సెల్ఫీ కెమెరాలు
ఫోన్ ఫ్రంట్‌లో 16 ఎంపీ సెన్స‌ర్‌, 8 ఎంపీ సెన్స‌ర్‌ల‌తో కూడిన రెండు కెమెరాలు ఉంటాయి. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు ఇదో కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ కాబోతోంది. బ్యూటిఫై 4.0 ఆప్ష‌న్ కూడా ఉంది. అల్ట్రా హెచ్‌డీ మోడ్‌, నైట్ మోడ్‌, యాంటీ షేక్ 2.0 వంటి పీచ‌ర్ల‌తో కూడిన 13 ఎంపీ రియ‌ర్ కెమెరా అమ‌ర్చారు. దీంతో 1080పీ రిజ‌ల్యూష‌న్‌తో వీడియోలు షూట్ చేయొచ్చు. ధ‌ర 22,999 ఉండొచ్చ‌ని అంచ‌నా. కొంత పెరిగినా పెర‌గొచ్చు.