రెండు రియర్ కెమేరాలతో ఫోన్లను ఇటీవల పలు కంపెనీలు లాంఛ్ చేస్తున్నాయి. కానీ.. తాజాగా చైనాకు చెందిన జియోనీ సంస్థ వెనుకా ముందు కూడా రెండేసి కెమేరాలతో ఫోన్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. వెనుకవౌపు డ్యూయల్ కెమేరాలు ఉండడమే కాకుండా సెల్ఫీ కెమేరాలు కూడా ఇందులో రెండు ఉండడం విశేషం. జియోనీ విడుదల చేయబోతున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎస్10' ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.
జియోనీ ఎస్ 10 స్పెసిఫికేషన్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.0, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ