జియోనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్లు చైనా మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇటీవల కాలంలో మార్కెట్లో వేగంగా విస్తరిస్తున్న జియోనీ ఫోన్లకు ఆన్ లైన్, ఆఫ్ లైన్లోనూ ఆదరణ పెరుగుతుండడంతో ఆ సంస్థ నుంచి ఫోన్ అనగానే అందరిలోనూ ఆసక్తి ఏర్పడుతోంది.
చైనా వెబ్ సైట్ టీనా అందించిన సమాచారం 'ఎస్10' ను పేరుతో వచ్చే నెలలో జియోనీ ఈ కొత్త ఫోన్ ను విడుదల చేయనుంది. మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు టీనా రిపోర్ట్ చేసింది. ఎస్ 9 కి సక్సెసర్‌గా దీన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభ్యంకానుందని తెలిపినప్పటికీ ధర వివరాలను మాత్రం వెల్లడి చేయలేదు. గత ఏడాది నవంబర్ జియోని ఎస్ 9 ను విడుదల చేసింది.
అయితే జియోనీ నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ధర విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. చైనా బయట ఎక్కడెక్కడ ఇది అందుబాటులో ఉంటుంది... ధర ఎంత ఉంటుంది... స్పెసిఫికేషన్స్ వంటి విషయంలోనూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా చైనీస్ వెబ్ సైట్లు మాత్రం దీనిపై పక్కా సమాచారం అంటూ వివరాలు వెల్లడిస్తున్నాయి.
జియోనీ ఎస్10 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్, 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3700 ఎంఏహెచ్ బ్యాటరీ