చైనా మొబైల్ సంస్థ జియోనీ ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ ను చైనాలో రిలీజ్ చేసింది. జియోనీ ఎస్10 అని పేరు పెట్టిన ఈ మోడల్ భారీ స్పెసిఫికేషన్లతో ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లోకి ఎంటరయింది. వన్‌ప్లస్ 3తో ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు జియోనీ ఎస్10 కూడా రావడం విశేషం. భారత కరెన్సీ ప్రకారం రూ.25వేల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్యాటరీ బ్యాకప్ విషయంలో మిగిలిన కంపెనీలన్నింటి కంటే టాప్ లో నిలిచే జియోనీ నుంచి ఈ ఫోన్ వస్తుంది కాబట్టి మంచి మార్కెట్‌ను కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది.
ఫ్రంట్, రియర్.. రెండేసి కెమెరాలు
ఇప్పటికే చాలా కంపెనీలు రియర్ సైడ్ రెండు కెమెరాలు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలతో ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. జియోనీ మరో అడుగు ముందుకేసి ఏకంగా నాలుగు కెమెరాలతో స్మార్‌్ెఫోన్ ను తీసుకొచ్చింది. ఈ ఎస్10 మోడల్‌కు ముందు వైపున రెండు కెమెరాలు, వెనక వైపున రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. వెనక వైపు కెమెరాలకు 16 ఎంపీ, 8 ఎంపీ సెన్సర్స్, ముందు వైపున 20 ఎంపీ, 8 ఎంపీ సెన్సర్లు పెట్టారు.
స్పెసిఫికేషన్లూ భారీగానే..
* 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
* మీడియాటెక్ ప్రాసెసర్
* 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ
* 3,450 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ నోగట్ 7.0 ఓఎస్