• తాజా వార్తలు

సొంత ప్లేస్టోర్‌తో వచ్చేస్తున్న హువావే నోవా 7ఐ

ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఏ యాప్ కావాల‌న్నా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాల్సిందే. అందుకే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనూ గూగుల్ ప్లే స్టోర్ డిఫాల్ట్ యాప్‌గా వ‌చ్చేస్తుంది. అయితే ఈ సంప్ర‌దాయానికి హువావే చెక్ పెట్ట‌బోతోంది. త‌న సొంత ప్లేస్టోర్‌తో ఓ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రిలీజ్ చేయ‌బోతోంది.

హువావే నోవా 7ఐ
హువావే నోవా 7 ఐ స్మార్ట్‌ఫోన్ హువావే ప్లే  స్టోర్‌తో వ‌చ్చింది. ఈ ఫోన్ ఫిబ్ర‌వ‌రిలో  మలేసియాలో రిలీజ‌యింది. వ‌చ్చే నెల‌లోనే ఇండ‌యిలో కూడా దీన్ని లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

ఇవీ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు

* 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

* ఆక్టాకోర్ హైసిలికాన్ కైరిన్ 810 ఎస్ఓసీ ప్రాసెస‌ర్

* ఆండ్రాయిడ్ 10 ఓఎస్

* హువావే యాప్ స్టోర్

*  8జీబీ ర్యామ్

* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. ఎస్డీ కార్డ్‌తో 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు.

* స‌కురా పింక్‌, మిడ్‌నైట్ బ్లాక్‌, క్ర‌ష్ గ్రీన్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది.

కెమె‌రాలు 
హువావే నోవా 7ఐ స్మార్ట్‌ఫో‌న్‌లో నాలుగు కెమెరాలున్నాయి. ఇందులో 48 ఎంపీ ప్ర‌ధాన కెమెరా ఉంటుంది.  8 మెగాపిక్స్‌ల్ సెకండరీ కెమెరా, మ‌రో రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి.  ఇక సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. సైడ్  మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో మ‌రో అద‌న‌పు అట్రాక్ష‌న్ .

40 వాట్స్ స‌పోర్ట్ చార్జింగ్
4,200 ఎంఏహెచ్ బ్యాటరీ
40W సపోర్ట్ చార్జ్ టెక్నాలజీ ఫీచ‌ర్ ఉంది. 

ధ‌ర‌
ఇండియాలో ధ‌ర ఎంతన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ 24 వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని మార్కెట్ అంచ‌నా.