• తాజా వార్తలు

హువాయి నుంచి అదిరే కెమెరాలతో Huawei P30 and p30 Pro

ప్రముఖ చైనా మొబైల్స్ మేకర్ హువాయి నుంచి హువాయి పి30,  హువాయి పి30  పేర్లతో రెండు ఫోన్లు రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు మార్చి 26న పారిస్‌లో జరుగనున్న ఓ ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ వెనుకభాగంలో 40 మెగాపిక్సల్, 16 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలను; ముందుభాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు. వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ గానూ ఈ ఫోన్‌ను రూపొందించారు. పి30 స్మార్ట్‌ఫోన్‌ 10 x జూమ్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌తో రానున్న మొదటి ఫోన్ ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. 

హువావే పి30 ప్రొ ఫీచ‌ర్లు 
6.47 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెఎరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.

హువావే పి30 ఫీచ‌ర్లు
6.1 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 16, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3650 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.

ధరలు, లాంచ్ 
అయితే ఈ ఫోన్ల ఫీచర్లను లీక్ చేసిన కంపెనీ ధరలను మాత్రం ప్రకటించలేదు. మార్చి 26న పారిస్‌లో జరుగనున్న ఈవెంట్లో వీటి ధరలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయనేది కూడా కంపెనీ ఇంకా తెలియపరచలేదు. కాగా ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ కెమెరాలే. హువాయి ఫోన్లు అంటేనే కెమెరాలకు పెట్టింది పేరని చెప్పవచ్చు. రానున్న ఫోన్లలో  40 మెగాపిక్సల్, 16 మెగాపిక్సల్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలను అలాగే సెల్పీ ప్రియుల కోసం ముందుభాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటుచేశారు.