ఇంటెక్స్ ఆక్వా సిరీస్ లో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. ఆక్వా క్రిస్టల్ ప్లస్ పేరుతో 4జీ వీవోఎల్టీఈ సపోర్టు ఉన్న ఈ మొబైల్ ను ఆకర్షణీయమైన ధరకే అందిస్తోంది ఇంటెక్స్.కాగా ఈ ఏడాది ఇప్పటికే ఇంటెక్స్ ఆక్వా క్రిస్టల్ ను లాంఛ్ చేసింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఆక్వా క్రిస్టల్ ప్లస్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ నౌగాట్ తో పనిచేసేలా తీసుకొచ్చింది. మంచి ఫీచర్లున్న ఈ ఫోన్ ధర రూ.6,799
అచ్చంగా క్రిస్టల్ లానే..
తాజాగా రిలీజ్ చేసిన క్రిస్టల్ ప్లస్ దాదాపుగా మునుపటి మోడల్ క్రిస్టల్ మాదిరిగానే కనిపిస్తోంది.ఇప్పుడొస్తున్న చాలా స్మార్టు ఫోన్లకు భిన్నంగా దీనికి సిమ్ స్లాట్ ను ఎడమవైపు ఇచ్చారు. యూఎస్బీ టైప్-సీ పోర్టు ఉంది. ప్రస్తుతం రెండు రంగులు తెలుపు, నలుపుల్లోనే దొరుకుతోంది.
స్పెసిఫికేషన్లు
* 5 అంగుళాల డిస్ ప్లే
* 1.25 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్
* 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ
* ఎక్స్పాండబుల్ మెమొరీ 128 జీబీ
* రియర్ కేమెరా 13 మెగా పిక్సెల్
* 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా
* బ్యాటరీ 2100 ఎంఏహెచ్