ఇండియన్ సెల్‌ఫోన్ కంపెనీ కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ ఆరా నోట్ పేరిట రిలీజ్ చేసిన 4జీ స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా 'ఆరా నోట్ 2' పేరిట కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ధర రూ.6,490. మూడు రంగుల్లో లభిస్తుంది.
ఫ్యాషన్ యాప్
కార్బన్ ఆరా నోట్2లో ఫ్యాషన్ యాప్ అనేది యూనిక్ ఫీచర్. యూజర్లు తమకు కావల్సిన డ్రెస్ లేదా ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను సెర్చ్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు. దీనిలోని AI ఇంజిన్ ఆ డ్రెస్ ప్యాట్రన్, ప్రింట్, కలర్‌ల గురించి కంప్లీట్ సెర్చ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. అంతేకాదు వివిధ ఈ కామర్స్ సైట్లలో ఆ డ్రెస్ లేదా యాక్సెసరీ ప్రైస్‌ను కూడా కంపేర్ చేసి ఎక్కడ తక్కువగా ఉందో చూపిస్తుంది. ఫ్యాషన్ అవుట్‌ఫిట్స్‌తో అప్‌డేటెడ్‌గా ఉండాలనుకునేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
స్పెసిఫికేషన్లు
* 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా
* 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 2900 ఎంఏహెచ్ బ్యాటరీ
* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్
* 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ .. 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్
* 4జీ VoLTE కనెక్టివిటీ