* అమెజాన్ లో హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు రూ.10 వేల తగ్గింపు
ఎల్‌జీ తన ప్రతిష్ఠాత్మక స్మార్ట్‌ఫోన్ 'జీ6' ను విడుదల చేసింది. రూ.51,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఆన్ లైన్లో ఒక్క ఆమెజాన్లో మాత్రమే దీన్ని విక్రయిస్తున్నారు. మంగళవారం నుంచి ఆఫ్ లైన్ స్టోర్లలోనూ దొరకబోతోంది. ఇటీవలే శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 8కి ఇది గట్టి పోటీ కానుంది. అయితే... చిప్ సెట్ విషయంలో ఎస్ 8తో ఇది ఏమాత్రం పోటీ పడలేదు.
కాగా ఆమెజాన్లో ప్రీఆర్డర్ చేసినవారికి రూ.7 వేల వరకు డిస్కౌంట్ రానుంది. దాంతో పాటు కొన్ని యాక్సెసరీస్ పైనా డిస్కౌంట్ వస్తోంది.
అమెజాన్లో ఆఫర్
మంగళవారం(ఏప్రిల్ 25) రోజున అమెజాన్లో ఈ ఫోన్ ను హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేసినవారికి రూ.10 వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో పాటు ముందే ప్రకటించి జియో డాటా ఆఫర్ కూడా ఉంది.
ఎల్‌జీ జీ6 ఫీచర్లు...
5.7 ఇంచ్ క్యూహెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
13, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
డాల్బీ విజన్, 4జీ ఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0