• తాజా వార్తలు

ఎల్జీ వీ 20పై 20% డిస్కౌంట్


* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొంటే 5% క్యాష్ బ్యాక్‌

* మే 31 వ‌ర‌కు ఆఫ‌ర్‌
ఎల్జీ ఇండియాలోకి అడుగుపెట్టి 20 సంవ‌త్స‌రాలు అవుతున్న సంద‌ర్భంగా త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌.. ఎల్జీ వీ20 మీద 20% డిస్కౌంట్ ఇస్తోంది. సెల‌బ్రేటింగ్ టుగెద‌ర్‌నెస్ ఆఫ‌ర్ కింద మ‌ల్టీ బ్రాండెడ్ షోరూమ్స్‌లో ఫోన్ కొన్న‌వారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్‌తో కొంటే అద‌నంగా 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఈఎంఐ ఆప్ష‌న్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మే 31 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ ఉంటుంది.

ఇవీ ఫీచ‌ర్లు



5.7 ఇంచెస్ క్వాలిటీ హెచ్‌డీ స్క్రీన్‌తో వ‌చ్చే ఎల్జీ వీ 20 ఆండ్రాయిడ్ నౌగ‌ట్ 7.0 వెర్ష‌న్ ఓఎస్‌తో ర‌న్ అవుతుంది.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 820 చిప్‌సెట్‌,
4 జీబీ రామ్‌త న‌డిచే ఈ స్మార్ట్‌ఫోన్ 16 ఎంపీ ప్రైమ‌రీ కెమెరాతోపాటు 8 ఎంపీ సెకండ‌రీ రియ‌ర్ కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్ చేసుకోవ‌డానికి, సెల్ఫీలు తీసుకోవ‌డానికి 5 మెగాపిక్స్‌ల్ ఫ్రంట్ కెమెరా 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్‌తో వ‌స్తుంది .
బ్యాట‌రీ 3200 ఎంఏహెచ్‌.
లైట్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ గైరో స్కోప్ వంటి ఆధునిక ఫీచ‌ర్ల‌న్నీ ఉన్నాయి.
4జీఎల్టీఈ తో ప‌ని చేస్తుంది.
ధ‌ర 44,900 రూపాయ‌లు. ఫ్లిప్‌కార్ట్‌లో 39,900 రూపాయ‌ల‌కు దొరుకుతుంది.