• తాజా వార్తలు

ఎల్‌జీ నుంచి 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్


ప్రఖ్యాత ఎలక్ర్టానిక్స్ సంస్థ ఎల్ జీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఎల్‌జీ ప్రదర్శించిన తన 'ఎక్స్ పవర్ 2' స్మార్ట్‌ఫోన్‌ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఇతర దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చేసింది. ప్రీ ఆర్డర్లు మొదలై షిప్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. త్వరలో నిర్వహించనున్న ఓ ఈవెంట్ ద్వారా ఎల్‌జీ ఈ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. దీని ధర వివరాలను ఆ ఈవెంట్‌లోనే వెల్లడించే అవకాశం ఉంది.
ఇవీ స్పెసిఫికేషన్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్