రోజుకో స్మార్టుఫోన్ సందడి చేస్తున్న సమయమిది. కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకట్టుకోవడానికి ఫోన్ కంపెనీలు భిన్నమైన ఆప్షన్లతో ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. భారత మొబైల్ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా కంపెనీలు పోటీపడిమరీ ఫోన్లను రంగంలకి దింపుతున్నాయి. అయితే చైనా మొబైల్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా భారత మొబైల్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను తెర మీదకు తీసుకు వస్తున్నాయి. తాజాగా మైక్రోమాక్స్ కంపెనీ డ్యుయల్ 5 మోడల్‌ను మార్కెట్లో అందుబాటులో ఉంచింది. . వినియోగదారులను ఆకట్టకునేలా... అందుబాటు ధరలో ఈ మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. మైక్రోమాక్స్ డ్యుయల్ 5 ఫీచర్లు కచ్చితంగా గత మైక్రోమాక్స్ మొబైల్స్ కన్నా మెరుగ్గా ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. 5.5 ఏఎంవో ఎఈడీ స్క్రీన్‌తో 2.5 డీ కర్వ్‌డ్ గ్లాస్‌తో ఈ ఫోన్ చూసేందుకు చాలా ముచ్చటగా ఉంది. పొరపాటున కిందపడినా ఎలాంటి పగుళ్లు రాకుండా, గీతలు పడకుండా గొరిల్లా గ్లాస్ 3 ఈ ఫోన్‌కు రక్షణగా ఉంది.
ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిని క్వాలకాం స్నాప్ డ్రాగన్ 652, అడ్రినొ 510 జీపీయూ ప్రొసెసర్. దీని వల్ల ఫోన్ వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. 4 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకత. సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న స్మార్టుఫోన్లలో ఎక్కువ 3జీబీ సామర్థ్యంతోనే ఉంటున్నాయి. ఐతే మైక్రోమాక్స్ డ్యుయల్ 5 మాత్రం 4 జీ సామర్థ్యం ఉంది. 4జీబీ డీడీఆర్3 ర్యామ్‌తో ఈ మొబైల్‌ను రూపొందించారు. రోమ్ 128 జీబీగా ఉంది. బ్యాటరీ సామర్థ్యం కూడా గొప్పగానే ఉంది. 3200 ఎంఏహెచ్ బ్యాటరీతో దీన్ని తయారు చేశారు. క్విక్ ఛార్జ్ 3.0 ఆప్షన్ ఉంది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ఈ మొబైల్ ఉంది.
అందరూ ఆసక్తిగా ఎదురు చూసే కెమెరా దీనిలో 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉంది. 13 మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరా విత్ సాఫ్ట్ ఫ్లాష్ ఉండడం మైక్రోమాక్స్ డ్యుయల్ 5 ప్రత్యేకత. ప్రస్తుతం వస్తున్న స్మార్టుఫోన్లలో అరుదుగా ఉంటున్న ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ ఈ ఫోన్‌లో ఉంది. అంతేకాదు చిప్ లెవల్ సెక్యూరిటీ, ఐఆర్ బ్లాస్టర్ దీని స్పెషల్. ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంచిన ఈ మొబైల్ ధర రూ.24,999.