• తాజా వార్తలు

న‌వంబ‌రులో లాంచ్ అవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఏవి?

స్మార్ట్ ఫోన్ల త‌యారీదారులు త‌మ కొత్త ఉత్ప‌త్తుల‌ను విడుద‌ల చేయ‌డానికి వ‌రుస క‌డుతున్నారు. మ‌రోవైపు అన్ని ఫోన్లూ ఒక‌టే అనిపించేలా మార్కెట్ల‌న్నీ ఆయా కంపెనీల డివైజ్‌ల‌తో నిండిపోయాయి. అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు ఇత‌ర ఫోన్ల‌క‌న్నా త‌మ స్మార్ట్ ఫోన్ అత్యుత్త‌మ‌మైన‌దిగా నిరూపించుకునేందుకు స‌రికొత్త ఫీచ‌ర్లు, డిజైన్లు, స్పెసిఫికేష‌న్ల‌తో మార్కెట్‌లో పోటీకి దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే మార్కెట్‌ను క‌ళ‌క‌ళ‌లాడించ‌బోయే కొన్ని స్మార్ట్ ఫోన్ల జాబితా మీ కోసం...
HUAWEI MATE 20 PRO
ఈ ఫోన్‌ను వా-వే కంపెనీ రెండు వారాల కింద‌టే లండ‌న్‌లో విడుద‌ల చేయగా, త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్ ప్ర‌వేశం చేయ‌బోతోంది. ఇందులో 6.39 అంగుళాల‌ AMOLED డిస్‌ప్లే; HiSilicon Kirin 980 ప్రాసెస‌ర్ ప్ర‌ధాన‌మైన‌వి. ‘మేట్ 20 ప్రో’లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తోపాటు స్టీరియో స్పీక‌ర్లున్నాయి. ఇది 128, 265 GB స్టోరేజ్ ఆప్ష‌న్లుస‌హా 6,  8 GB ర్యామ్‌ వేరియంట్లలో ల‌భిస్తుంది. దీని 4200 mAh బ్యాట‌రీ Qi వైర్‌లెస్ చార్జింగ్‌ను స‌పోర్ట్ చేసే ఇత‌ర ఫోన్లను కూడా వైర్‌లెస్‌గా చార్జి చేయ‌గ‌ల‌దు.
ONEPLUS 6T
ఆండ్రాయిడ్ మార్కెట్‌లో వినియోగ‌దారుల‌కు ఒన్‌ప్‌తస్ ఒక నిత్యావ‌స‌రంగా మారిన రోజులివి. ఈ కంపెనీ ఇటీవ‌లే కొత్త డివైజ్‌ను విడుద‌ల చేసింది. స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 8 GB వ‌ర‌కు ర్యామ్‌తో వ‌చ్చిన OnePlus 6Tలో మునుప‌టి వెర్ష‌న్‌లోగ‌ల‌ ఇంట‌ర్న‌ల్స్ కొన‌సాగాయి. ఈ కొత్త ఫోన్‌లో 3.5 మిల్లీమీట‌ర్ల హెడ్‌ఫోన్ జాక్ మాయ‌మై ఒకే పోర్ట్ USB-Cతో రానుంది. ఇక ఇన్‌-డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ రీడ‌ర్‌తో వ‌స్తున్న తొలి ఒన్‌ప్ల‌స్ డివైజ్ ఇదే. ఇందులో 3700 mAh బ్యాట‌రీ ఉంటుంది.
SAMSUNG GALAXY A9
ఈ శామ్‌సంగ్ కొత్త ఉత్ప‌త్తి క్వాడ్‌-కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. దీనిలో 6.3 అంగుళాల సూప‌ర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. Samsung’s Galaxy A9 స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6, 8 GB ర్యామ్ వేరియంట్ల‌తో వ‌స్తోంది. క్వాడ్‌-కెమెరా సెట‌ప్‌లో ప్ర‌ధాన కెమెరా 24 MP సామ‌ర్థ్యంగ‌ల‌ది కాగా, 10 MP టెలిఫొటో కెమెరా, 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్స‌ర్ ఉంటాయి. దీని ఆన్‌బోర్డ్ స్టోరేజి సామ‌ర్థ్యం 128 GB కాగా, 3800 mAh బ్యాట‌రీ ఉంటుంది.
XIAOMI REDMI NOTE 6 PRO
భార‌త్‌లోని మ‌ధ్య‌స్థ శ్రేణి కొనుగోలుదారుల‌కు ఎంతో ప్రియ‌మైన షియోమీ త‌క్కువ ధ‌ర‌లోనే అగ్ర‌శ్రేణి స్పెసిఫికేష‌న్‌‌తో ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా చైనా మార్కెట్‌లో ఇది శామ్‌సంగ్‌కు గ‌ట్టి పోటీదారుగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైతే Note సిరీస్‌లో తాజా ఫోన్ Note 5 Pro కాగా, త్వ‌ర‌లో విడుద‌లయ్యే Note 6 Proతో ట్రెండ్ మార‌బోతోంది. ఈ కొత్త ఫోన్ 6.62 ఫుల్ HD డిస్‌ప్లేతో రాబోతోంది. ఇది స్నాప్‌డ్రాగ‌న్ 636 ప్రాసెస‌ర్‌తోపాటు 3, 4, 6 GB ర్యామ్ వేరియంట్ల‌తో వ‌స్తోంది.
NOKIA 7.1
స్మార్ట్ ఫోన్ ప‌రుగు పందెంలోకి మ‌ళ్లీ దూసుకొచ్చిన ఈ ఫిన్లాండ్ దిగ్గ‌జ సంస్థ ఈ ఏడాది ప‌లు కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను ప్ర‌వేశపెట్టింది. ఇవ‌న్నీ బాగా పాపుల‌ర్ అయిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే మ‌న దేశంలో ఈ జాబితాకు కొత్త ఫోన్ Nokia 7.1ను జ‌త చేయ‌బోతోంది. ఈ ఫోన్‌లో 5.84 ఫుల్ HD డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగ‌న్ 636 ప్రాసెస‌ర్‌స‌హా 3, 4 GB RAM వేరియంట్ల‌లో 3,060 mAh బ్యారీతో రానుంది.