ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న నోకియా పెంటా కెమెరా నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ అతి త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పడు వినియోగదారులను ఆకట్టుకునేలా స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐదు రియర్ కెమెరాలతో కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్టు గతంలోనే నోకియా ప్రకటించింది. 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న 5 ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి త్వరలోనే తీసుకురానుంది. దీనికి సంబంధించి బ్యూరో ఆప్ బిజినెస్‌స్టాండర్డ్ (బీఐఎస్) సర్టిఫికెట్‌ను పొందినట్టు కూడా తెలుస్తోంది.
ఈ మొబైల్ త్వరలోనే భారత మార్కెట్లోకి వస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా హెడ్ అజయ్ మెహతా తెలిపారు. కాగా, నోకియా 9 ప్యూర్ వ్యూ మొబైల్ ఫీచర్ల ఆకట్టుకునేలా ఉండనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.2019 ఫిబ్రవరిలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో పరిచయం చేసిన నోకియా 9 ప్యూర్ వ్యూ ధర దాదాపు రూ.50 వేలుగా ఉండవచ్చని అంచనా.
నోకియా 9ఫ్యూర్ వ్యూ ఫీచర్లు ( అంచనా )
5.99/6 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ , 12 ఎంపీ పెంటా రియర్ కెమెరా(హైలైట్ ఫీచర్), 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3డీ టీఓఎఫ్ సెన్సార్, 3,320/4150 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఇదిలా ఉంటే హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 4.2ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నోకియా 4.2 రూ.10,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
నోకియా 4.2 ఫీచర్లు
5.71 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
నోకియా 3.2 ఫీచర్లు
6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.