ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తోంది. జెడ్‌టీఈ బ్రాండ్ నూబియా తన కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ఎన్1 ను ఈ రోజు లాంచ్ చేయబోతుంది. ఈ విషయాన్ని సంస్థ ట్విట్టర్‌లో ఆదివారం ఎనౌన్స్ చేసింది. నూబియా ఎన్ 1 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఇండియాలో ఈ రోజే లాంచ్ చేయబోతున్నారు. డెకరేటివ్ మెటాలిక్ డిజైన్, స్టైలిష్ ఫోన్ ఎప్పీయరెన్స్‌తో పాటు చేతిలో అమరేలా డిజైన్ చేశారు. 2జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర ఎంతనేది ఇంకా తెలియలేదు. స్పెసిఫికేషన్స్ * 5.5 ఇంచెస్ ఫుల్ హెడ్‌డీ డిస్‌ప్లే * క్వాడ్‌కోర్ ప్రాసెసర్ * 2జీబీ ర్యామ్ * 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్‌డీ కార్డ్‌తో 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. * 8 మెగాపిక్సెల్ రియర్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా * 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఓఎస్