• తాజా వార్తలు

వన్‌ప్ల‌స్ 3టీ త‌యారీ ఆపేస్తున్నాం.. అధికారికంగా ప్ర‌క‌టించేసిన కంపెనీ

వ‌న్‌ప్ల‌స్ 3టీ.. అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌. శాంసంగ్ వంటి దిగ్గ‌జ కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు దీటుగా మార్కెట్లోకి దూసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ కనుమ‌ర‌గ‌వ‌బోతోంది. కొత్త మోడ‌ల్ వ‌న్‌ప్ల‌స్ 5ను ఈ సమ్మర్ లోనే తీసుకురావ‌డానికి వ‌న్‌ప్ల‌స్ చాలా స్పీడ్‌గా స‌న్నాహాలు చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ల ప్రొడ‌క్ష‌న్ ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
మోస్ట్ సక్సెసఫుల్ ఫోన్‌
వ‌న్‌ప్ల‌స్ 3టీ ఫిబ్ర‌వ‌రిలో ఇండియ‌న్ మార్కెట్లోకి వ‌చ్చింది. శాంసంగ్ 50 వేల రూపాయ‌ల పైగా ధ‌ర‌లో అందించే ఫోన్ల‌లో ఉండే ఫీచ‌ర్ల‌న్నీ దీనిలో ఉండ‌డం విశేషం. అంతేకాదు కెమెరా ఎంపీ, స్టోరేజ్‌, బ్యాట‌రీ కెపాసిటీలో గెలాక్సీ ఎస్‌8 కంటే వ‌న్‌ప్ల‌స్ 3టీలో ఎక్కువ‌గా ఉంటాయి. గెలాక్సీ ధ‌ర 57 వేల రూపాయ‌లు కాగా వ‌న్‌ప్ల‌స్ 3టీ ధ‌ర 30వేల‌లోపే. కొన్ని ఈ -కామ‌ర్స్ సైట్ల‌లో 3వేల వ‌ర‌కు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు స‌గం ధ‌ర‌లోనే ఆ ఫీచ‌ర్ల‌న్నీ ఉండ‌డం, పెర్‌ఫార్మెన్స్ ప‌రంగానూ మంచి రిపోర్ట్ ఉండ‌డంతో మార్కెట్లో వ‌న్‌ప్ల‌స్ 3టీకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.
స్టాక్ ఉన్నంత వ‌ర‌కే సేల్స్‌
ఈ ఏడాది చివరి వరకే వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ భారత్ లో అమ్మకానికి ఉంటుందని కంపెనీ చెప్పింది. 64జీబీ, 128జీబీ వేరియంట్లలో వ‌న్‌ప్ల‌స్ మార్కెట్లో లభ్యమవుతోంది. ''స్టాక్ అయిపోయే లోపలే వన్ ప్లస్ 3టీ కొనుక్కోండి. కంపెనీ వేర్ హౌజ్ లో కొన్ని యూనిట్లే మిగిలిఉన్నాయి. ఇక ఈ ఫోన్లను తయారు చేయదలుచుకోలేదు '' అని బ్లాగ్‌లో వ‌న్‌ప్ల‌స్ స్పష్టంగా చెప్పేసింది. మార్కెట్లో ఉన్న వన్ ప్లస్3, వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్లకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ల సపోర్టును తీసుకొస్తుంటామని కంపెనీ చెప్పింది. 128జీబీ స్టోరేజ్ కలిగిన వన్ ప్లస్ 3టీ గన్ మెటల్ కలర్ ఆప్షన్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే లిస్టు చేయడం ఆపివేసింది. 64జీబీ వెర్షన్ లోనూ ఇప్ప‌టికే చాలా క‌ల‌ర్స్ అవుటాఫ్ స్టాక్. కొనుక్కోవాలంటే మాత్రం త్వ‌ర‌ప‌డండి.