వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5ను ఈ సమ్మర్‌లోనే మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్‌ప్లస్ కొత్త మోడల్ తయారీలో తమ ఎంప్లాయిస్ బిజీగా ఉన్నారని సంస్థ సీఈవో పీట్ లా మూడు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ వేసవిలోనే వన్‌ప్లస్ 5 మోడల్‌ను రిలీజ్ చేస్తామని కంపెనీ ప్రకటించినట్లు తాజాగా ఓ రిపోర్టు తెలిపింది. ఇవన్నీ కలిపి చూస్తే వన్‌ప్లస్ 5 ఈ జూన్‌లోపే లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి.
ఎన్‌బీఏ ప్లేయర్ జెర్సీ నంబరే ఇన్‌స్పిరేషన్
వన్ ప్లస్ 3, 3టీ మోడల్స్‌ను ఇప్పటికే లాంచ్ చేసిన కంపెనీ తర్వాత వన్ ప్లస్ 4 కాకుండా నేరుగా వన్‌ప్లస్ 5 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే టెక్ మార్కెట్ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 4 అనేది చైనాలో అన్‌లక్కీ నెంబర్ కాబట్టి ఈ పేరుతో కాకుండా వన్ ప్లస్ 5 పేరుతో మోడల్ వస్తున్నట్లు రూమర్స్‌వచ్చాయి. అయితే దీనికి కారణం అది కాదని, ఫార్మర్ ఎన్‌బీయే (బాస్కెట్‌బాల్) ప్లేయర్ రాబర్ట్ హారీకి వన్‌ప్లస్ ఎంప్లాయిస్‌లో చాలా మంది ఫాన్స్ ఉన్నారని, అందుకే ఆయన జెర్సీ నెంబర్ 5 కలిసి వచ్చేలా వన్‌ప్లస్ 5 అని పేరు పెడుతున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.
ఫీచర్లు ఇలా ఉండొచ్చు
శుక్రవారం ఓ ఆన్‌లైన్ రిటైల్ సైట్‌లో వన్‌ప్లస్ 5 స్పెసిఫికేషన్లు, ప్రైస్ గురించి కొంత సమాచారం వచ్చింది. దీని ప్రకారం వన్ ప్లస్ 5 కాస్ట్ ఇంచుమించుగా 28,800 రూపాయలు ఉండవచ్చు. అయితే ఇది 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్‌దా, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ప్రైసా తెలియలేదు. రియర్ కెమెరా డ్యూయల్ కెమెరా అదీ వర్టికల్‌గా ఉండొచ్చు. లేటెస్ట్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌వోఎస్ ప్రాసెసర్, 5.5 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో మరో వెర్షన్ తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా రూమర్లు ఉన్నాయి.