• తాజా వార్తలు

వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌న్‌ప్ల‌స్ 5 మ‌రో 15 రోజుల్లో లాంచ్ కానుంది. జూన్ 22న ఇండియాలో వ‌న్‌ప్ల‌స్ 5 రిలీజ్ చేయ‌డానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 20న విదేశాల్లో రిలీజ‌య్యే ఈ ఫోన్ రెండు రోజుల త‌ర్వాత ఇండియాలో లాంచ్ కానుంద‌ని తాజా స‌మాచారం.
శాంసంగ్‌, ఎల్‌జీ వంటి కంపెనీలు 50 వేల ధ‌ర‌తో అందించే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల‌ను 30వేల లోపు ధ‌ర‌కే తేవ‌డంతో వ‌న్‌ప్ల‌స్ కు ఇండియ‌న్ మార్కెట్‌లో మంచి క్రేజ్ తెచ్చింది. ఈ ఏడాది మొద‌ట్లో రిలీజ్ చేసిన వ‌న్‌ప్ల‌స్ 3 హిట్టవ‌డంతో త‌ర్వాత ఎలాంటి మోడ‌ల్‌ను తీసుకొస్తుందా అని యూజ‌ర్లు చాలా ఉత్కంఠత‌తో ఎదురుచూస్తున్నారు. దానికితోడు రోజుకో ఫీచ‌ర్ గురించిన రూమ‌ర్స్‌తో వ‌న్‌ప్ల‌స్ 5 టెక్నాల‌జీ స‌ర్కిల్స్‌లో బాగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో కంపెనీ వ‌న్‌ప్ల‌స్ 5 రిలీజ్ గురించి ఓ టీజ‌ర్ ఫొటో రిలీజ్ చేసింది.
సూప‌ర్ ఫీచ‌ర్స్‌!
వ‌న్‌ప్ల‌స్ 5 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం ఫెఓన్ స్పెక్స్ ఇలా ఉండొచ్చు * 5.5 ఇంచెస్ డిస్ ప్లే * డ్యూయ‌ల్ లెన్స్‌ రియ‌ర్ కెమెరా విత్ 23 ఎంపీ * 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా * ఫ్లాగ్‌షిప్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెసర్ * 8 జీబీ ర్యామ్ * 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
30వేల లోపే ప్రైస్
ప్ర‌స్తుతం ఉన్న రూమ‌ర్స్ ప్ర‌కారం వ‌న్‌ప్ల‌స్ 5 హారిజంటల్ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌తో వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ధ‌ర ఎంత‌నేది తెలియ‌క‌పోయినా 30వేల లోపే ఉండొచ్చ‌ని అంచ‌నా.