• తాజా వార్తలు

మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌ వంటి దేశాలలో మాత్ర‌మే ల‌భ్యం కానుంది. ఇక ఈ ఫోన్లో వ‌న్‌ప్ల‌స్ 7 లోని ఫీచ‌ర్ల‌నే ఏర్పాటు చేశారు. కాక‌పోతే 5జీ కోసం ప్ర‌త్యేకంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌50 5జీ మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ ఫోన్ త్వ‌ర‌లో యూకేలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది. ఇక దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో విడుద‌ల చేసే ఆలోచ‌న‌పై వ‌న్‌ప్ల‌స్ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు..!

వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫీచ‌ర్లు
6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే,3120 x 1440 pixel screen resolution,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్,6/8/12 GB RAM,128/256 GB STORAGE,Android 9.0 పై,dial sim,48+ 8 + 16 MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,16 MP selfie camera,ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,
USB type c,Dolby Atmos,Dual 4G Volte,Dual band wifi ,bluetooth 5.0,4000 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్‌.

ధర
వన్‌ప్లస్ 7 ప్రొ ధర రూ.48,999 నుంచి ప్రారంభకానుంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.52,999గా, 12 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.57,999గా ఉంది.

OnePlus7 ఫీచర్లు
6.41 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే,fingerprint sensor,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8GB RAM, Android 9.0, వెనుక భాగంలో 48 + 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా, Dolby Atmos,3700 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్

వన్‌ప్లస్ 7 ధర
వన్‌ప్లస్ 7 ధర రూ.32,999 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. రెండు ఫోన్లు మే 17 నుంచి అందుబాటులోకి వస్తాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు మే 16 నుంచి ఈ ఫోన్లను కొనొచ్చు.