చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో రెడ్‌మి 5ఎని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మి 7ఎ స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. రెడ్ మి 7ఎ మోడల్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైటులో అందుబాటులో ఉండనుంది. రెడ్ మి A సిరీస్ ఫోన్లలో రెడ్ మి 5A, రెడ్ మి 6A, రెడ్ మి 7A మోడల్ స్మార్ట్ ఫోన్లు Filpkart, Mi.com వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయి.
రెడ్‌మీ 7ఎ ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2GB RAM + 16GB స్టోరేజీ, 2GB RAM + 32GB స్టోరేజీ, 3GB RAM + 32GB స్టోరేజీ ,సింగల్ 13 మెగాఫిక్సల్ సెన్సార్ ,LED ఫ్లాష్ మాడ్యుల్, AI ఫీచర్ , PDAF ఫోకస్, AI బ్యూటీ, AI బ్యాక్ గ్రౌండ్ బ్లర్ ,5MP సెల్ఫీ కెమెరా సెన్సార్, 4000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ ,డ్యుయల్ SIM సపోర్ట్, 4G VoLTE, Wi-Fi,Bluetooth 4.2, GPS, మైక్రోUSB పోర్ట్ ,3.5mm హెడ్ ఫోన్ జాక్, MIUI 10 OS ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్
రెడ్‌మి 6ఎ సక్సెసర్
కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లలో 16/32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
దేశ్ కా స్మార్ట్‌ఫోన్' రెడ్‌మీ 5ఎ ఫీచర్లు
స్మార్ట్‌ఫోన్ 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు లభిస్తున్నది.
షియోమీ రెడ్‌మీ 5ఏ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.