సచిన్ రమేశ్ టెండుల్కర్.. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఈ పేరు తెలియనివారు చాలా తక్కువ మందే. క్రికెట్ దేవుడిగా కీర్తించబడుతున్న సచిన్ పేరుతో ఏకంగా ఓ స్మార్ట్‌ఫోనే రిలీజ్ అవబోతోంది. సచిన్.. ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగంలోకి వస్తున్న టెండూల్ ర్ చరిత్ర.. ఇప్పుడు మొబైల్ ఫోన్ల రంగంలోకి సచిన్ ఆగమనంతో మరింత ప్రాచుర్యంలోకి రాబోతోంది. మే 3న ఈ ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది.
ఎస్ఆర్‌టీ..
ఎస్ఆర్‌టీ (సచిన్ రమేశ్ టెండుల్కర్) ఫోన్ అని పేరు పెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పని చేస్తుంది. ఐవోటీ స్టార్టప్ కంపెనీ స్మార్ట్రాన్ దీన్ని మాన్యుఫాక్చర్ చేసి అమ్మబోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో టెండూల్కర్ స్ట్రాటజిక్ పార్టనర్ కావడం మరో విశేషం. ప్రతి ఫోన్ బ్యాక్ కవర్‌పై టెండూల్కర్ ఆటోగ్రాఫ్‌తో వస్తుండడం మరో ప్రత్యేకత. ఈ స్మార్ట్‌ఫోన్ ధర 15వేల రూపాయలు ఉంటుందని, కాబట్టి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి గెయిన్ సాధిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
సచిన్ పేరే పెద్ద మార్కెటింగ్ టూల్
క్రికెట్ లెజండ్‌గా సచిన్‌కు ఇండియాలో ఉన్న క్రేజ్ ఈ ఫోన్‌కు మంచి ఎసెట్ అవుతుందన్నది మార్కెట్ విశ్లేషణ. అదీకాక మోటో ఇండియా ఎండీ అమిత్‌బోనీ స్మార్ట్రాన్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇండియాలో మోటో రివైవల్ వెనక అమిత్ ఎఫర్ట్ చాలా ఉంది. మార్కెటింగ్‌లో మంచి స్ట్రాటజీలున్న అమిత్ లీడర్‌షిప్‌లో ఈ ఎస్ఆర్‌టీ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇవీ స్పెసిఫికేషన్స్
* 5.5 ఇంచెస్ ఎమౌల్డ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్
* ఆక్టాకోర్ ప్రాసెసర్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ఎస్‌వోసీ చిప్‌సెట్
* 4 జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ మెమరీ
* 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్, ఆటోఫోకస్
* ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఓఎస్
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ