సెల్‌ఫోన్ కంపెనీల దృష్టి మళ్లీ పాత మోడల్స్‌పైకి పోతున్నట్లు కనిపిస్తోంది. పది పన్నెండేళ్ల కిందట బాగా హల్‌చల్ చేసిన ఫోల్డబుల్ మోడల్ ఫోన్లు మళ్లీ మార్కెట్‌లోకి వస్తున్నాయి. శాంసంగ్ 'గెలాక్సీ ఫోల్డర్ 2' పేరిట ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను లేటెస్ట్‌గా కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో ఈ ఫోన్ ఇండియాలోనూ రిలీజవనుంది. ధర దాదాపు 17వేల వరకు ఉండొచ్చు.
టచ్, కీప్యాడ్ రెండూ
ఫోల్డబుల్ ఫోన్లలో పై భాగం టచ్ స్క్రీన్ ఎనేబుల్డ్ ఉంటుంది. ఇక డౌన్ పార్ట్ కీప్యాడ్‌తో వస్తుంది. కాబట్టి టచ్, కీప్యాడ్ రెండూ వాడుకునే ఫెసిలిటీ ఉంది. కాకపోతే ఫోల్డబుల్ కాబట్టి స్క్రీన్ సైజ్ తగ్గుతుంది.
ఫీచర్లు
* 480 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్తో 3.8 ఇంచ్ డిస్‌ప్లే
* 8 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు
* డ్యూయల్ సిమ్
* 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ
* 1950 ఎంఏహెచ్ బ్యాటరీ
* 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్)
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్