• తాజా వార్తలు

యాపిల్‌ను వెన‌క్కి నెట్టిన శాంసంగ్

కొరియా లెజెండ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ప్రొడ‌క్ష‌న్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. యాపిల్‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ స్మార్ట్‌ఫోన్ల ఉత్ప‌త్తిలో ఫ‌స్ట్ ప్లేస్‌కు వ‌చ్చేసింది. ఈ సంవ‌త్స‌రం మొద‌టి మూడు నెల‌ల్లో ప్రొడక్షన్ వాల్యుమ్ లో 26.1 శాతం షేరుతో శాంసంగ్ తొలి స్థానాన్ని సొంతం చేసుకుందని ట్రెండ్ ఫోర్స్ రిపోర్టు చెప్పింది. ఆయాపిల్ 16.9 శాతం షేరుతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. యాపిల్ కంటే శాంసంగ్ ఏకంగా 10% షేర్ ఎక్కువ‌గా క‌లిగి ఉండ‌డం విశేషం. 2017 తొలి క్వార్టర్లో 307 మిలియన్ స్మార్ట్ ఫోన్ యూనిట్లు ఉత్పత్తిఅయ్యాయ‌ని రిపోర్ట్ తెలిపింది. అంత‌కు ముందు మూడు నెల‌ల‌తో పోలిస్తే ఇది 23 శాతం తక్కువ.
గెలాక్సీ జే సిరీస్‌తోనే..
బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చిన గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ కు ప్రొడ‌క్ష‌న్‌లో ఫ‌స్ట్‌ప్లేస్‌కు వెళ్ల‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డా్డ‌యి. 2016 నాలుగో క్వార్టర్లో (అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు) శాంసంగ్ కేవలం 18.5 శాతం మార్కెట్ షేరును మాత్రమే కలిగి ఉంది. యాపిల్ 20.3% షేరుతో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండేది. మూడు నెల‌లు తిరిగేస‌రికి సీన్ రివ‌ర్స‌యింది. యాపిల్‌ను రెండో స్థానానికి నెట్టి శాంసంగ్ ఫ‌స్ట్ ప్లేస్ ప‌ట్టేసిది. గెలాక్సీ జే-సిరీస్ స్మార్ట్ ఫోన్లు కంపెనీ టాప్ లో నిలబెట్టాయని ట్రెండ్ ఫోర్స్ పేర్కొంది. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో శాంసంగ్, ఆపిల్ తర్వాత మూడో స్థానాన్ని ఆశ్చ‌ర్య‌క‌రంగ హ్యువాయ్ సొంతం చేసుకుంది. ఈ కంపెనీ ప్రొడ‌క్ష‌న్ వాటా ఏకంగా 11.4% . ఒప్పో 8.1%, వివో 6.2%, ఎల్జీ 4.2% గ‌తం కంటే తక్కువ స్థానాల్లో నిలిచాయి.