స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు ఇండియా బంగారుబాతులా మారింది. కంపెనీలు కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ మార్కెట్ షేర్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. శాంసంగ్, షియోమి, ఓపో, వివో, మోటోరోలా, ఎల్జీ ఇలా అన్ని కంపెనీలు జూన్‌లో కూడా చాలా ఫోన్లను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి వివరాలు మీ కోసం..
మోటోరోలా జీ6 ప్లే
18:9 నిష్పత్తిలో హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ ఉంటుంది. 3జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌తో వస్తుంది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ధర 9వేల నుంచి 11వేల రూపాయల్లోపు ఉండొచ్చు. ఈ సెగ్మెంట్‌లో ఉన్న విపరీతమైన పోటీ నేపథ్యంలో 10 వేల లోపు ధరలోనే మోటో దీన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
ఎప్పుడొస్తుంది: ఈ రోజే (జూన్ 4న) ఇండియాలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
దీంతోపాటు మోటోరోలా జీ6, మోటోరోలా జీ6 ప్లే కూడా కొంచెం అటూఇటూగా ఇవే ఫీచర్లతో రాబోతున్నాయి
లెనోవో జీ 5
కొన్నాళ్లుగా కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ఏదీ తీసుకురాకుండా కామ్‌గా ఉన్న లెనోవో ...లెనోవో జీ 5ను ఈ నెలలోనే లాంచ్ చేయబోతోంది. 90% బాడీ టు స్క్రీన్ రేషియో ఉండడంతో దాదాపు ఫోనంతా స్క్రీన్ కనిపిస్తుంది. కెమెరా కింద ఉండొచ్చని అంచనా. 3జీబీ ర్యామ్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 4 టీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ వస్తుందని రూమర్స్ నడుస్తున్నాయి. 400 జీబీకి మించి ఎస్డీ కార్డులే లేవు. అలాంటిది 4టీబీ స్టోరేజ్‌తో ఫోన్ తయారుచేయడం ఎంత వరకు సాధ్యమన్నది ఎక్స్‌పర్ట్‌ల ప్రశ్న.
వన్‌ప్లస్ 6 సిల్క్ వైట్
ఇప్పటికే బ్లాక్, ఎవెంజర్ ఎడిషన్లతో ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చిన వన్‌ప్లస్ 6.. ఈ నెలలో మరో మోడల్‌ను తీసుకురాబోతోంది. వన్‌ప్లస్ 6 సిల్క్ వైట్ పేరుతో జూన్ 5 తర్వాత ఎప్పుడైనా దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
రెడ్‌మీ వై2కే
|షియోమి జూన్ 7న ఈ ఫోన్‌ను రిలీజ్ చేయబోతోంది. రెడ్‌మీ ఎస్2 పేరుతో చైనాలో ఇప్పటికే లాంచ్ అయిన ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఇండియాలో రిలీజ్ చేయబోయే రెడ్‌మీ వై2కేలో ఉంటాయని అంచనా. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 16 ఎంపీ కెమెరా, వెనుకవైపు 12, 15 ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ధర 9వేల నుంచి 9,500 వరకు ఉండొచ్చని అంచనా.
ఓపో ఫైండ్ ఎక్స్
ఓపో నుంచి ఫైండ్ ఎక్స్ సిరీస్ ఫోన్లు ఈ నెలలో రానున్నాయి. 19, 20 తేదీల్లో చాలా మోడల్స్ రావచ్చు.అయితే ముందుగా జూన్ 12 ఓపో ఫైండ్ ఎక్స్ ఫోన్ రాబోతుందని అంచనా.
ఎల్జీ క్యూ7నోట్
18:9 నిప్షత్తిలో 5.5 ఇంచెస్ స్క్రీన్ ఉండే ఈ ఫోన్ 4జీబీ ర్యామ్‌తో నడుస్తుంది., 16 ఎంపీ రియర్ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ 6750 ఎస్ ప్రాసెసర్ దీని స్పెక్స్. జూన్ రెండోవారంలో రావచ్చు.
ఇక శాంసంగ్ గెలాక్సీ ఏ9, గెలాక్సీ ఏ 9 స్టార్లతోపాటు శాంసంగ్ ఆన్7, ఆన్8కి అప్‌గ్రేడ్ మోడల్స్‌ను జూన్‌లో రిలీజ్ చేయనుంది.
ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్‌లో ఫోన్లు, హానర్ నుంచి కొన్ని కొత్త మోడల్స్ రాబోతున్నాయి. మరోవైపు బ్లాక్‌బెర్రీ బిజినెస్ క్లాస్ ఎడిషన్ బ్లాక్‌బెర్రీ కీ2 జూన్ 8న రిలీజవనుంది.