వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డివైస్ లను, కొత్త కొత్త ఫీచర్లను జోడించి విడుదల చేస్తుంటాయి. ఈ నెలలో పలు కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. వాటి విశేషాలపై ఓ లుక్కేద్దాం...
హువావే హానర్ 10
హువావే కంపెనీ తన పీ20 సిరీస్‌లో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఫోన్ ఇది. కిరిన్ 970 చిప్ సెట్, ట్వైలైట్ వంటి పెయింట్ జాబ్ (మిరేజ్)తో అందుబాటు ధరలోనే ఇది రానుంది. ఇది చైనాలో ఇదివరకే లాంచ్ అయింది. మే 15న లండన్లో, ఆ తర్వాత జూన్ నెల నాటికి ఇండియాలో విడుదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గాఅందుబాటులో ఉంటుంది. చైనాలో దీని ధర 2,600 యువాన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 27,000. కానీ మనదగ్గర ధర ఇంకొంచెం పెరగవచ్చు. దీని ధర రూ. 35 వేలకు పైనే ఉండవచ్చని, ఇదివరకే అందుబాటులోకి వచ్చిన హానర్ వ్యూ 10 (రూ. 30,000) కంటే ధర ఎక్కువైనా, కొన్ని ఫీచర్లలో దాని కంటే బెటర్ గా ఉంటుందని భావిస్తున్నారు.
* 6జీబీ ర్యామ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా దీనిలో ఇతర ఫీచర్లు
వన్ ప్లస్ 6
23 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎక్స్‌మెర్ ఆర్ఎస్ సీఎంఓఎస్ సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటివి ఉన్నాయి. ఎక్సటర్నల్ మెమరీకి అవకాశం లేకపోవడం, బ్యాటరీ పవర్ తక్కువగా ఉండటం, కెమెరా పనితీరు దీనికి మైనస్ లు అని చెప్పొచ్చు. మే 17న ఇండియాలో విడుదల కానుంది.
* 5.7 అంగుళాల స్క్రీన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వీ8.0 (ఓరియో) ఓఎస్‌తో నడుస్తుంది. బ్యాటరీ 3500 ఎంఏహెచ్
* ధర: రూ. 37,999
ఎల్జీ జీ7 థింక్ యూ
ఫుల్ విజన్ ప్యానెల్ తో 6.1 అంగుళాల స్క్రీన్ తో ఆకర్షణీయంగా వస్తోంది ఎల్జీ జీ7 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ స్ర్కీన్ ఓఎల్ఈడీకి బదులుగా ఎల్సీడీ ఆధారంగా పనిచేస్తుంది. ఆర్జీబీడబ్ల్యూ అరేంజ్ మెంట్ ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. ఎల్జీ తొలిసారిగా ఈ ఫోన్లోనే హార్డ్‌వేర్ అసిస్టెంట్ బటన్ జోడించింది. గూగుల్ అసిస్టెంట్ హార్డ్‌వేర్ కీని కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కానుంది.
* ఫోన్ వెనక వైపునా గ్లాస్ ఉండటం వల్ల వైర్‌లెస్ చార్జింగ్ కు వీలుంటుంది.
*ఫేస్ డిటెక్షన్, లేజర్ ఆటోఫోకస్ సౌకర్యాలతో 16 ఎంపీ డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 71 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో, మరోటి 107 డిగ్రీల సూపర్ వైడ్ వ్యూలో పనిచేస్తుంది.
* వెలుతురు అంతగా లేనప్పుడూ మంచి రిజల్యూషన్ తో ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ఏఐ కెమెరా టెక్నాలజీ కూడా ఉండటం మరో ప్రత్యేకత.
*సౌండ్ విషయానికి వస్తే డీటీఎస్ ఎక్స్ తో కూడిన బూమ్ బాక్స్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది.
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
*స్నాప్ డ్రాగన్ 845 చిప్ సెట్‌తో కూడిన ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలు. 128 జీబీ ఇంటర్నల్ మెమరీ. ఎస్డీ కార్డుతో మరింత పెంచుకోవచ్చు.
షియోమీ రెడ్ మీ ఎస్2
షియోమీ నుంచి కొత్త ఫోన్ రెడ్ మీ ఎస్2 వస్తుందన్న వదంతులు నిజమేనని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ చైనాలో మే 10న విడుదలవుతోంది. ప్రస్తుత రెడ్ మీ ఎస్ సిరీస్‌లోని ఫోన్ల కన్నా ఈ ఫోన్ ధర తక్కువగా ఉండవచ్చు. దీనిలో స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంటుంది.
* 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో రానున్న దీనిని సెల్ఫీ డివైస్ గా చెప్పుకొంటున్నారు. వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
* 5.99 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఇచ్చారు. ఫాస్ట్ బ్యాటరీ చార్జింగ్ ఆప్షన్ ఉంది.
* ధర సుమారుగా రూ. 11,600 ఉండొచ్చు.
షియోమీ ఎంఐ 7
చైనా మొబైల్ దిగ్గజం షియోమీ మరో ఫోన్ ఎంఐ 7ను కూడా మే 23న చైనా మార్కెట్లోకి తీసుకురానుంది. లీక్ అయిన ఫొటోలను బట్టి చూస్తే.. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లేనట్లు కనిపిస్తోంది. అంటే 3.5 ఎంఎం అడాప్టర్ కు యూఎస్‌బీ టైప్ సీని ఉపయోగించి, మీ రెగ్యులర్ హెడ్ ఫోన్స్ ను ఎంఐ 7కు కనెక్ట్ చేసుకోవచ్చన్నమాట.
* ఎంఐ 6 కన్నా స్క్రీన్ టు బాడీ రేషియో తగ్గడం, ఐఫోన్ ఎక్స్ మాదిరిగా 3డీ ఫేషియల్ స్కానింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ వంటివి మరికొన్ని ప్రత్యేకతలు.
* 6/ 8 జీబీ ర్యామ్, 64 / 128 / 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌తో వస్తోంది.
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో బేస్డ్ ఎంఐయూఐ 10 ఓఎస్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఇండియాలో విడుదల చేస్తే ధర సుమారుగా రూ. 35,000 ఉండొచ్చు.
నోకియా ఎక్స్ 6
నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్ నోకియా ఎక్స్ 6 మే 6న విడుదల కానుంది. ఇండియాలో జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. గొరిల్లా గ్లాస్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 12 ఎంపీ, 13 ఎంపీ డ్యూయల్ ప్రైమరీ కెమెరా వంటివి ఉన్నాయి. బెస్ట్ బై, అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది. నోకియా 6 (2018) ఫోన్ దానికి ముందు వచ్చిన ఫోన్ ఎదుర్కొన్న స్లో చిప్ సమస్యను ఫిక్స్ చేస్తూ స్నాప్ డ్రాగన్ 430కి బదులుగా 630తో తీసుకురాబడుతోంది. ఇది ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టులో భాగం. అంటే మిగతా బ్రాండ్ల కంటే ముందుగా ఈ ఫోన్ కు అప్‌డేట్స్ అందుతాయి.
* ఆండ్రాయిడ్ వీ8.1 (ఓరియో) ఓఎస్
* 5.8 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లే
*3500 ఎంఏహెచ్ బ్యాటరీ(ఫాస్ట్ చార్జింగ్ యూఎస్బీ టైప్ సీ పోర్ట్)
*ఆక్టా కోర్, క్వాడ్ కోర్, మీడియా టెక్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్‌తో, 64 జీబీ + 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
* ధర: రూ. 16,890 (అంచనా)
మోటో ఇ5 ప్లస్
మోటోరోలా కొత్తగా మోటో ఇ5, మోటో ఇ5 ప్లస్ ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ రెండూ మోటో ఇ4 మాదిరిగానే 18:9 స్క్రీన్, నైస్ డిజైన్ తో తయారయ్యాయి. మోటో జీ6తో పోలిస్తే మోటో ఇ5 ప్లస్ కొంచెం పెద్ద స్క్రీన్ తో(5.99 అంగుళాలు) రాబోతోంది. ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉండటం ప్రధాన ఆకర్షణ. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 లేదా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. గొరిల్లా గ్లాస్ ఫ్రంట్, ప్లాస్టిక్ బ్యాక్, వెనకవైపు ఫింగర్ ప్రింట్ రీడర్, వాటర్ ప్రూఫ్ నానో కోటింగ్ ఇతర ప్రత్యేకతలు.
* క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 425చిప్ సెట్, క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్
* 2 జీబీర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో ఎస్డీతో 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు)
* ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్
* ధర: సుమారుగా రూ. 15000 (అంచనా)
మోటో ఇ5
మోటో ఇ5 విషయానికి వస్తే.. అన్నింట్లోనూ మోటో ఇ5 ప్లస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. 5.7 అంగుళాల స్క్రీన్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 425 ఉంటాయి. 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, (256 జీబీ వరకు మైక్రో ఎస్డీ స్లాట్), ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటివి ఉంటాయి. ధర సుమారుగా రూ. 12,000.
శాంసంగ్ గెలాక్సీ ఏ6 అండ్ ఏ6 ప్లస్
శాంసంగ్ నుండి గెలాక్సీ ఏ6, ఏ6 ప్లస్ ఫోన్ల విడుదల, వాటి స్పెషిఫికేషన్స్ గురించి ఆ కంపెనీ అధికారికంగా తన వెబ్ సైట్లో ప్రకటించింది. మే నెలలోనే కొన్ని ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో, దక్షిణ కొరియా, ఆఫ్రికా, ఆ తర్వాత చైనాలో విడుదలవుతాయి. రెండింటిలోనూ శాంసంగ్ గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్, గెలాక్సీ ఏ8 సిరీస్ ఫోన్ల మాదిరిగా ఏఎంఓఎల్ఈడీ ఇన్ఫినిటీ డిస్‌ప్లేలు ఉంటాయి. ఏ6లో 5.6 అంగుళాల హెచ్‌డీప్యానెల్, ఏ6 ప్లస్ లో 6.0 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటామి ఏ6లో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఏ6 ప్లస్‌లో ఆక్టాకోర్ 1.6 గిగాహెర్జ్, ఆక్టా కోర్ 1.8 గిగాహెర్జ్ ఎస్ఓసీ ప్రాసెసర్లను జోడించారు. ఏ6లో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, సింగిల్ రియర్ సెన్సర్ 16 ఎంపీ కెమెరా, ఏ6 ప్లస్ లో 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ (16 ఎంపీ, 5 ఎంపీ) ప్రైమరీ సెన్సర్ కెమెరాలు అమర్చారు. రెండింటిలోనూ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ రికగ్నిషన్, డాల్బీ అట్మాస్ స్పీకర్లు, శాంసంగ్ పే ఉంటాయి. రెండూ క్యాట్ 6 ఎల్టీఈ, హెచ్‌టీ టెక్నాలజీతో పని చేస్తాయి. అయితే, వీటిని భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు.
గెలాక్సీ ఏ6 ధర: రూ. 24,750 , గెలాక్సీ ఏ6 ప్లస్ రూ. 29,500 వరకు ఉంటుంది.