సోని..ఇది ఎన్నో ఏళ్ల నుంచి వినియోగదారుల మనసును చూరగొంటున్న బ్రాండ్. గృహోపకరణాలే ప్రధానంగా మొదటి నుంచి మార్కెట్లో ఉన్న సోని.. నెమ్మదిగా మొబైల్ రంగంలోకి కూడా ప్రవేశించింది. నోకియా, శాంసంగ్ కంపెనీల నుంచి పోటీ తట్టుకుంటూ మంచి మొబైల్‌లను సోని రంగంలోకి దింపింది. ఆ మొబైల్‌లు వినియోగదారుల ఆదరణ పొందాయి కూడా. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ మరో ఫోన్‌ను తెర మీదకు తెచ్చింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో ఉండే అన్ని ఫీచర్లను కలగలిపి అందరికి నచ్చేలా ఒక మొబైల్‌ను మార్కెట్లోకి వదులుతోంది సోని. దాని పేరు ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్. గతంలో వచ్చిన సోని ఎక్స్‌పీరియా సిరీస్ మొబైల్ ప్రియులను విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా మ్యుజిక్ లవర్స్‌కు ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. దీంతో సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ సిరీస్ కూడా మ్యూజిక్‌తో పాటు 4జీ సేవల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.
కెమెరా స్పెషలిస్ట్
చాలామంది ఫోన్‌ను కెమెరా కోసమే కొంటారు. అలాంటి వారి కోసం సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ సరైన ప్రత్యామ్నాయం. మంచి ఫొటోలను కోరుకునే వారికి ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ మంచి ఆప్షన్. దీనిలో ఉన్న న్యూ మోషన్ ఐ కెమెరా సిస్టమ్ మనకు కావాల్సిన విధంగా ఫొటోలను తీయడానికి ఉపయోగపడనుంది. అంటే సైబర్ షాట్ ఆర్ఎక్స్ టెన్ కెమెరాలో వాడే టెక్నాలజీని ఇందులో వాడడం వల్ల ఫొటోలు మంచి క్లారిటీతో వస్తాయి. అంతేకాదు ఫోన్ వేడెక్కడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఈ ప్రధాన సమస్యను ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫిక్స్ చేసింది. మనం ఎంత సేపు వాడినా ఆ ఫోన్ వేడెక్కే అవకాశం లేదు.
అదిరే డిజైన్, లుక్
సోని ఎక్స్‌పీరియాలో మరో ప్రధాన ఫీచర్. ఆ ఫోన్ డిజైన్ మరియు లుక్. ఎలాంటి షార్ప్ ఎడ్జ్‌లు లేకుండా సున్నితంగా ఉండే ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునేలా తయారు చేశారు. ఫోన్‌ను హోల్డ్ చేయడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. స్క్రీన్ కింద భాగంలో ఉండే ఎడ్జ్‌తో ఫోన్‌ను మంచి హోల్డ్ చేసే వీలుంది. పోన్ అడుగు భాగంలో ఉండే స్పీకర్ వల్ల మన వాయిస్ క్లారిటీ కూడా పెరుగుతుంది. 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ఆకర్షణ. స్ర్కీన్ బాలెన్స్‌ను అడ్జెస్ట్ చేసుకునే బ్యాలెన్స్ దీనికి ఉంది. ఈ డిస్ ప్లేని గొరిల్లా గ్లాస్‌తో తయారు చేశారు. యూఎస్‌బీ సి టైప్ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ సాకెట్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీనికి కెమెరా షట్టర్ ఉండడం మరో ప్రత్యేకత. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 821 వెర్షన్‌తో ఈ ఫోన్‌ను తయారు చేశారు.