ప్రముఖ జపాన్ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సోనీ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకపై భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ల విడుదలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్‌కు చెందిన ఈ కంపెనీకి భారత మార్కెట్లో నష్టాలు రావడంతో ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో పాటు దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలపై ఇక నుంచి పెద్దగా ద ష్టి సారించబోమని ప్రకటించింది.
2020ను కంపెనీకి లాభాల ఆర్థిక సంవత్సరంగా మార్చుకోవాలని సోనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్వహణ వ్యయాలను 50 శాతం వరకు తగ్గించుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే జపాన్ ఎలక్ట్రానిక్ మేజర్ సోనీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నామంటూ ప్రకటించింది. అలాగే 5జి సేవలను దష్టిలో పెట్టుకుని ఇక నుంచి మేము జపాన్, యూరప్, హాంగ్‌కాంగ్, తైవాన్ దేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే సెంట్రల్, సౌత్ అమెరికాలో అమ్మకాలు నిలిపివేశామని, అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని సోనీ వెల్లడించింది.
కాగా ఇప్పటికే సోనీ స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారికి కంపెనీ తరపు నుంచి పూర్తి సేవలు అందుతాయని తెలిపింది. అమ్మకాలు ఆపేసినా వినియోగదారులకు అన్ని విధాలా సేవలందిస్తామని పేర్కొంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్స్‌తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి సోనీ మొబైల్స్ 97.1 బిలియన్ యెన్ (879.45 డాలర్లు) నష్టపోయింది. పోటీ కంపెనీలు ఐనా ఆపిల్, శాంసంగ్ భారీ లాభాలను గడించాయి. ఇక చైనా ఫోన్లు ఇండియాలో పాగా వేయడంతో కంపెనీకి తీవ్ర నష్టాలు తప్పలేతు. ఈ పోటీలో నష్టాల పాలైన సోనీ తమ ఉత్పత్తుల విక్రయాలను పలు దేశాల్లో నిలిపివేయాలనే సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఉన్న పోటీ మరే ఇతర మార్కెట్లలో లేదంటే అతిశయోక్తికాదు. అయితే భారత్‌లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల హవా భారీగా నడుస్తోంది. వీటి దెబ్బకి శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజాలు కూడా వణుకుతున్న పరిస్థితి. సోనీ లాంటి బ్రాండెడ్ కంపెనీలపై కూడా మరింత ప్రభావం పడుతోంది. అదీకాకుండా అతి తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లలో స్మార్ట్‌ఫోన్లు వస్తుండటంతో వినియోగదారులు అటువైపు అడుగులు వేస్తున్నారు.
ముఖ్యంగా చైనా మొబైల్ మేకర్ షియోమి, హువాయి రాకతో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పూర్తిగి మారిపోయిండి బడ్జెట్ రేంజ్ లో ఈ కంపెనీలు నువ్వా నేనా అంటూ పోటీలు పడుతూ తమ డివైస్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇక హైఎండ్ ఫీచర్ మార్కెట్లో ఒప్పో, వన్ ప్లస్, ఆపిల్, శాంసంగ్ కంపెనీలు నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. వీటిని ఢీకొట్టడంలో ఈ జపాన్ కంపెనీ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది.