వివో తన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో ఐక్యూ 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ ను షాంఘైలో జరుగుతున్న ఎండబ్ల్యూసీ సదస్సులో ప్రదర్శించింది. వివో కంపెనీ ఈ ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త టెక్నాలజీతో వచ్చిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను అమర్చనుంది. అలాగే ఇందులో ఎక్స్50 మోడెమ్ ను పొందుపరచనుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముందని కంపెనీ వెబ్ సైట్లో పెట్టిన పోస్టును బట్టి తెలుస్తోంది. కంపెనీ ఈ ఫోన్ లభ్యత గురించి ఎలాంటి విషయాన్ని అధికారికంగా వివో వెల్లడించలేదు.
ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ
ఇదిలా ఉంటే దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ' తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ' 5జీని ఇప్పటికే విడుదల చేసింది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లో 5జీని అందిస్తున్నారు. అయితే ఈ ఫోన్ ధర వివరాలను ఎల్‌జీ సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఒక బ్లాక్ కలర్ లో మాత్రమే లభించనుంది. డ్యూయల్ స్క్రీన్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. సౌత్ కొరియా, ఆస్ట్రేలియాలలో ఈ ఫోన్ లభించనుంది.
ఫీచర్లు:
6.4 ఇంచ్ ఫుల్ విజన్ ఓలెడ్ డిస్‌ప్లే,డ్యూయల్ స్క్రీన్,3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్), 16, 12, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్
దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఈ ఏడాదిలో 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకు రానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా టెలికాం సంస్థ వెరిజోన్‌తో కలిసి శాంసంగ్ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని అమెరికాలోని హవాయ్‌లో జరిగిన వార్షిక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ టెక్నాలజీ సదస్సులో వెరిజోన్ ఉపాధ్యక్షుడు బ్రియాన్ హిగ్గిన్ తెలిపారు.
ఎంఐ మిక్స్ 3 5జీ
చైనా దిగ్గజం షియోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్ 3 5జీ ను త్వరలో విడుదల చేయనుంది. అక్టోబర్ 25న ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క 5జీ మాత్రమే కాదు అనేక సరికొత్త ఆవిష్కరణలతో రానుంది ఎంఐ మిక్స్ 3. వీబోలోని తమ అధికారిక పేజీలో ఆ విశేషాలను వివరించింది షియోమీ. ఎంఐ మిక్స్ 3 ర్యామ్ 10 జీబీ కావడం విశేషం. ఏకంగా 10 జీబీ ర్యామ్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని తెలుస్తోంది. ప్రపంచంలో 5జీ సపోర్ట్ చేసే తొలి కమర్షియల్ ఫోన్ కూడా ఇదేనని కంపెనీ చెబుతోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ లాగా పాప్-ఔట్ స్లైడర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. క్వాల్కమ్ ఎక్స్50 5జీ మోడెమ్ కూడా ఎంఐ మిక్స్ 3లో ఉండనుంది. ఈ ఫోన్ స్క్రీన్-టు-బాడీ రేషియో కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని అంచనా. స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, 10జీబీ ర్యామ్ లాంటి స్పెసిఫికేషన్స్ మాత్రమే ప్రస్తుతానికి తెలుసు. ఇంకా ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో తెలియాలంటే లాంఛింగ్ వరకు ఆగాల్సిందే.
ఒప్పో మొబైల్స్ 5జీ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్ల కంపెనీ ఒప్పో మొబైల్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో మార్కెల్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. రెండో త్రైమాసికం నుంచి భారత్‌లో ట్రయల్‌కు సిద్ధంగా ఉండనున్నట్టు కంపెనీ తెలిపింది. ‘‘భారత్‌లో ట్రయల్స్ కోసం రెండో త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌తో సిద్ధంగా ఉంటాం. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో చర్చలు జరుపుతున్నాం. ట్రయల్స్‌పై ఆ కంపెనీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డీ హెడ్ తస్లీమ్ అరిఫ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. గ్లోబల్ టెలికాం సంస్థలైన స్విస్‌కామ్, ఆప్టస్, టెల్‌స్ర్టా, సింగ్‌టెల్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
హువాయి మేట్ ఎక్స్ 5జీ
హువాయి ఇటీవలే మేట్ ఎక్స్ ఫోల్డబుల్ పేరిట ఓ నూతన మడతబెట్టే ఫోన్‌ను బార్సిలోనాలో విడుదల చేసిన విషయం విదితమే. ఇందులో 5జీకి సపోర్ట్‌ను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. దీంతో భారత్‌లో విడుదల కానున్న తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. హువాయి మేట్ ఎక్స్ ఫోల్డబుల్ ఫోన్‌లో 6.6 ఇంచుల డిస్‌ప్లే, 6.38 ఇంచుల సెకండరీ డిస్‌ప్లే, కైరిన్ 980 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0 పై, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 40, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర రూ.1,85,220 గా ఉంది.
రియల్‌మి 5జీ
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకుపోతున్న రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా 5జీ స్మార్ట్‌ఫోన్ అంశాన్ని వెల్లడించారు. 5జీ ప్రొడక్టులను ఈ ఏడాదిలోనే ఆవిష్కరించబోతున్నామని రియల్‌మి ఇండియా సీఎండీ మాధవ్ సేథ్ ప్రకటించారు. స్కైలితో సమావేశం అనంతరం సేథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సాధ్యమైనంత త్వరలో భారతదేశానికి అత్యుత‍్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించబోతున్నామన్నారు. చైనా, ఇండియాలోలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన నెలరోజుల్లోనే తమ ఉత్పత్తులను ప్రవేశపెడతామని తెలిపింది.