• తాజా వార్తలు

ఆకట్టుకునే పీచర్లతో హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ, నోకియా 3.2,ఇన్ఫినిక్స్ ఎస్‌4

ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజు రోజుకు వేగం పుంజుకుంటోంది. కొత్త కొత్త మోడల్స్ ఇండియాకు వస్తున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లు, బడ్జెట్ ధరతో ఈ ఫోన్లు మార్కెట్లో యూజర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఫోన్లను ఓ సారి చూద్దాం. 

హువాయి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్లు హాన‌ర్ 20, 20 ప్రొ ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.38,785 ప్రారంభ ధ‌ర‌కు హాన‌ర్ 20 ఫోన్‌ వినియోగదారుల‌కు జూన్ 11వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ల‌భ్యం కానుండ‌గా, రూ.46,550 ప్రారంభ ధ‌ర‌కు హాన‌ర్ 20 ప్రొ ఫోన్ ల‌భ్యం కానుంది. 
హాన‌ర్ 20, హాన‌ర్ 20 ప్రొ ఫీచ‌ర్లు
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ (హాన‌ర్ 20), 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ (హాన‌ర్ 20 ప్రొ), ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 16, 8, 2 మెగాపిక్స‌ల్ క్వాడ్ర‌పుల్ బ్యాక్‌ కెమెరాలు (హాన‌ర్ 20 ప్రొ), 48, 16, 2, 2 క్వాడ్ర‌పుల్ బ్యాక్ కెమెరాలు (హాన‌ర్ 20), 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, వ‌ర్చువ‌ల్ 9.1 స‌రౌండ్ సౌండ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాట‌రీ (హాన‌ర్ 20), 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ (హాన‌ర్ 20 ప్రొ), సూప‌ర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.

మొబైల్స్ త‌యారీదారు హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ నోకియా 3.2 ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8,990 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. కాగా లాంచింగ్ సంద‌ర్భంగా ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు. 
నోకియా 3.2 ఫీచ‌ర్లు
6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, స్నాప్‌డ్రాగ‌న్ 429 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ ఎస్‌4 ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.8,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగదారుల‌కు లభిస్తోంది.
ఇన్ఫినిక్స్ ఎస్‌4 ఫీచ‌ర్లు
6.21 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 8, 2 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.