• తాజా వార్తలు

రూ.20 వేల లోపు ధరలో బెస్ట్ సెల్ఫీ ఫోన్లు

ఒక మోస్తరు ఫీచర్లతో ఉన్న స్మార్టు ఫోన్లు రూ.5 వేల నుంచి దొరుకుతున్నాయి. అయితే... రూ.15 నుంచి 20వేల మధ్య ధరలో అయితే ఇప్పుడున్న అన్ని అవసరాలకు సరిపోయేలా పూర్తి సంతృప్తి చెందడానికి వీలుండే ఫోన్లు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా యువత సెల్ఫీలంటే మోజు పడుతుండడంతో సెల్ఫీ కెమేరాలపై ఫోకస్ చేసి పలు పోన్లను లాంచ్ చేస్తున్నారు. అలా బెస్ట్ సెల్ఫీ ఫోన్లు రూ.20 వేల లోపు ధరలలో దొరికేవి ఏమున్నాయో చూద్దాం.

* ఒప్పో ఎఫ్ 3


దీని ధర రూ.19,990
కెమేరా ఫోన్లకు ప్రసిద్ధి గాంచిన ఈ ఒప్పో ఫోన్లో డబ్బుకు తగ్గ అన్ని స్పెసిఫికేషన్లు ఉణ్నాయి. ముఖ్యంగా సెల్ఫీ కెమేరా అదిరిపోయిందని చెప్పాలి. 16 ఎంపీ, 8 ఎంపీ సామర్థ్యమున్న రెండు ఫ్రంట్ కెమేరాలు ఇందులో ఉణ్నాయి. డబ్డ్ డబుల్ గ్రూప్ వ్యూ, 120 డిగ్రీస్ వైడ్ యాంగిల్ వ్యూ ఉండడంతో ఎక్కువ మంది ఉణ్నా అందర్నీ కవర్ చేస్తూ సెల్ఫీ తీసుకోవచ్చు. ఇది కాకుండా 4జీబీ ర్యామ్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటోంది.

* వివో వీ5ఎస్


ధర రూ.18990
ఫ్రంట్ కెమేరాలకు పెట్టింది పేరైన వివో కూడా దాన్నే నమ్ముకుని తెచ్చిన ఫోన్ ఇది. మిగతా వివో ఫోన్ల మాదిరిగానే కనిపించే ఈ మోడల్ లో ఏకంగా 20ఎంపీ ఫ్రంట్ కెమేరా ఉంది. మూన్ లైట్ గో ఫ్లాష్, ఫేస్ బ్యూటీ వంటి ఫీచర్లతో పాటు సెల్ఫీ ప్రియులకు అవసరమైన అన్ని ఫీచర్లూ ఇందులో ఉణ్నాయి. పైగా ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ రామ్ వంటి అదనపు ఆకర్షణలు.

* ఒప్పో ఏ57


ధర రూ.14,990
16 ఎంపీ సెల్ఫీ కెమేరా దీని ప్రత్యేకత. బ్యూటిఫై 4.0, బోకే ఎఫెక్ట్, ఫాస్ట్ ఆటో ఫోకసింగ్ కోసం పీడీఏఎఫ్ టెక్నాలజీ వంటివి ఇందులో ఉన్నాయి.

* జియోనీ ఏ1


ధర.. రూ.19,999... సెల్ఫీ కెమేరా 16 ఎంపీ

* నూబియా జడ్ 17 మినీ


ధర.. రూ. 19,999... 16 ఎంపీ సెల్ఫీ కెమేరా