కాల్ చేస్తున్నవ్యక్తి నెంబర్ మన దగ్గర లేకపోయినా ఆ వ్యక్తి ఎవరో తెలియజెప్పే ట్రూ కాలర్ యాప్ విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్లకే పరిమితమైన ట్రూకాలర్ సౌకర్యాన్ని తొలిసారిగా ఫీచర్ ఫోన్లకు కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ సౌకర్యం ఇండియాలో మాత్రమే మొదట రానుంది. అదీ ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే కావడం గమనార్హం. ఈ ఫీచర్ ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మొబైల్ కనెక్షన్‌కు అవకాశం లేని ఫీచర్ ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ కస్టమర్లకు ట్రూకాలర్ సౌకర్యాన్నికల్పించబోతున్నట్లు స్వీడిష్ కంపెనీ ట్రూకాలర్ తాజాగా ప్రకటించింది. కాల్ రావడానికి ముందే ఫ్లాష్ మెసేజ్ రూపంలో కాలర్ డిటెయిల్స్‌ను ఎయిర్‌టెల్ ఫీచర్ ఫోన్ కస్టమర్‌కు ట్రూకాలర్ పంపిస్తుంది. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్‌గా ప్రవేశపెట్టనున్న ఈ సౌకర్యానికి కొంత ఛార్జీ చేస్తారు.. తొలుత ఎయిర్‌టెల్ కస్టమర్లకు మాత్రమే దీన్ని ఎక్సక్లూజివ్‌గా అందించబోతున్నామని ట్రూకాలర్ సీఎస్‌వో నమీ జర్రింగ్ హామ్ చెప్పారు. తర్వాత దీన్ని ఇతర మార్కెట్లకు విస్తరించడంపై ఆలోచిస్తామన్నారు.